జియో 365 రోజుల ప్లాన్.. ప్రయోజనాలెన్నో! | Jio Rs 3599 Recharge Plan Details | Sakshi
Sakshi News home page

జియో 365 రోజుల ప్లాన్.. ప్రయోజనాలెన్నో!

Published Mon, Aug 12 2024 9:03 PM | Last Updated on Tue, Aug 13 2024 8:37 AM

Jio Rs 3599 Recharge Plan Details

ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేసిన జియో మళ్ళీ మెల్లగా దిగి వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల నాలుగు కొత్త ప్రీపెయిడ్ ఆఫర్‌లు ప్రకటించింది. కాగా ఇప్పుడు 3599 రూపాయల వార్షిక ప్లాన్ వెల్లడించింది. ఈ ప్లాన్ వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

జియో వార్షిక ప్లాన్ రూ. 3599 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ నెలకు రూ.276 వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రతి రోజూ హైస్పీడ్ 2.5 జీబీ డేటా పొందవచ్చు. అంటే 365 రోజులూ రోజులు 2.5 జీబీ లెక్కన 912.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉపయోగించుకోవచ్చు.

ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు ప్రీపెయిడ్ ఆఫర్‌లు
రూ.199 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్‌స్క్రిప్షన్‌లు (18 రోజులు) ఉన్నాయి.

రూ.209 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సిస్ లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement