రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ESA) డే వేడుకలు జియో హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో ఉత్సాహంగా జరిగాయి. ఈఎస్‌ఏ ప్రోగ్రాంలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని వెయ్యి మంది చిన్నారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. రిలయన్స్ ఫౌండేషన్ కహానీ, కాలా, ఖుషీ ప్రచారంలో భాగంగా ఈ విద్యార్థులకు ఆటలు, క్విజ్ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
జియో వరల్డ్ గార్డెన్‌లో అజ్మీరా రియాల్టీతో కలిసి జియో ప్రెజెంట్స్ హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో జరిగే కార్నివాల్‌లో మాన్‌స్టర్ రైడ్, హామ్లీస్ విలేజ్, హాంటెడ్ సర్కస్, ఫెర్రిస్ వీల్, రంగులరాట్నాలు లాంటి పలు ఆకర్షణీయమైన గేమ్‌లు ఉన్నాయి.
ముఖ్యంగా జంతు సంక్షేమ చొరవలో ‘వంటారా’ స్టాల్స్ ప్రత్యేకంగా కొలువు దీరాయి. వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షించడం, చిక్కుకుపోయిన పక్షులను రక్షణ, రక్షించిన జంతువులను పోషించడం, జంతువులను అక్రమ రవాణా నుండి రక్షించడం వంటి పనుల్లో విద్యార్థులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టనుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ రిలయన్స్ ఫౌండేషన్ క్యూరేటెడ్ వంటరా జంతు బొమ్మలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించింది.
రిలయన్స్ 'వి కేర్' అనే చొరవలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్, ఈఎస్‌ఏ ద్వారా విద్యార్థులకు విద్యాక్రీడా రంగంలో అవకాశాలను కల్పించేలా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. డిసెంబరులో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం, వెనుకబడిన వర్గాల పిల్లల సాధికారత, ఊహలు ఆకాంక్షలకు రెక్కలు తొడిగేలా ప్రోత్సాహాన్నిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment