ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌, 2 జీబీ డేటా.. జియో బెస్ట్‌ ప్లాన్‌ ఇదే.. | Jio best plan free Netflix subscription 2GB daily | Sakshi
Sakshi News home page

ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌, 2 జీబీ డేటా.. జియో బెస్ట్‌ ప్లాన్‌ ఇదే..

Published Sun, Aug 25 2024 9:16 AM | Last Updated on Sun, Aug 25 2024 9:16 AM

Jio best plan free Netflix subscription 2GB daily

దేశంలో అత్యధిక యూజర్లు ఉన్న టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. దీనికి సుమారు 48 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇటీవల టారిఫ్‌లు పెంచిన తర్వాత మంచి ప్రయోజనాలు ఉన్న బెస్ట్‌ ప్లాన్‌ల కోసం యూజర్లు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తూ ఇతర బెనిఫిట్స్‌ లభించే ఒక బెస్ట్‌ జియో ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన కొత్త కాంబో ప్లాన్‌ను జియో ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మెరుగైన మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్‌ అవుతుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. దీంతో మీరు స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ విస్తారమైన లైబ్రరీలో ఉన్న వేలాది మూవీస్‌, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు.

ప్లాన్‌ బెనిఫిట్స్‌
ఈ ప్లాన్ ధర రూ. 1,299. వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అపరిమిత కాలింగ్‌తో యూజర్లు ఏ నెట్‌వర్క్‌లో అయినా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. 5జీ ఫోన్‌ని ఉపయోగిస్తున్నవారు తమ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే 5జీ డేటాను ఉపయోగించవచ్చు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement