ప్రైవేటు టెలికం సంస్థలు గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారారు. బీఎస్‌ఎన్‌ఎల్ చవకైన ప్లాన్‌లను అందిస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తమ వినియోగదారులను నిలుపుకోవడానికి పలు చవక రీఛార్జ్ ప్లాన్‌లను రూపొందించింది.
సాధారణంగా కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌కు నెలకు కనీసం రూ. 180 నుండి రూ.200 ఖర్చవుతుంది. కానీ ఈ జియో ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అంతకన్నా తక్కువ ఖర్చవుతుంది. అదే రిలయన్స్ జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్. ఇది 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే నెలకు రూ. 173 మాత్రమే ఖర్చవుతుంది.
ఈ ప్లాన్ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాపంగా ఉచిత రోమింగ్ అందిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 24GB హై-స్పీడ్ డేటా, 3600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను ఆనందించవచ్చు. అంతేకాకుండా జియో అనుబంధ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment