
సాక్షి,చెన్నై: క్యాంపస్ రిక్రూట్‌మెంట్లతో ఉన్నత విద్యా సంస్థలు కళకళలాడనున్నాయి. ఆర్థిక మందగమనం క్రమంగా తొలగిపోతుండటంతో దిగ్గజ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లతో తాజా నైపుణ్యాలను సమీకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. డిసెంబర్ 1నుంచి ప్రారంభమయ్యే ఐఐటీ మద్రాస్ వార్షిక ప్లేస్‌మెంట్స్‌లో తొలిసారిగా యాపిల్, యూఐడీఏఐ వంటి సంస్థలు పాల్గొననున్నాయి.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న కంపెనీల్లో దాదాపు 15 శాతం సంస్థలు తొలిసారి ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో యూబీఎస్ ఏజీ, నాస్డాక్ స్టాక్ మార్కెట్, అల్వారెజ్,మర్సాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ గార్డెన్,హల్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెకిసూ కెమికల్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. మొత్తం 400 జాబ్ ప్రొఫైల్స్‌తో 270 కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకున్నాయి.
గత ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో 250 కంపెనీలు పాల్గొన్నాయి. ఇక ఈ ఏడాది పార్టిసిపెంట్స్‌లో 43 శాతం రిక్రూటర్స్ ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డీ నుంచి, 25 శాతం ఫైనాన్స్ రంగం, 32 శాతం కంపెనీలు ఐటీ రంగం నుంచి పాల్గొంటున్నాయి. 2017-18 క్యాంపస్ రిక్రూట్‌మెంట్ తొలిదశ డిసెంబర్ 1 నుంచి 10 వరకూ జరుగుతుందని ఐఐటీ మద్రాస్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ 50 స్టార్టప్‌లకు శ్రీకారం చుట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment