ఉద్యోగ అవకాశాలు పొందిన డిగ్రీ విద్యార్థులు
కామారెడ్డి టౌన్ : ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది యువతను చూస్తున్నాం. ఉద్యోగం కోసం వివిధ రాష్ట్రాలలో ఇంటర్వూ్యలకు వెళ్లిన జాబ్‌లు రానివారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రాంగణ నియామకాలతో డిగ్రీ చేస్తుండగానే చాలా మంది యువత ఉద్యోగం సాధిస్తున్నారు. కళాశాలలకే ప్రముఖ కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలను డిగ్రీ విద్యార్థులకు కల్పిస్తున్నారు. కళాశాలకు చెంతకే వచ్చి ఇంటర్వూ్యలు నిర్వహించి జాబ్‌లకు ఎంపికచేసుకుంటున్నారు. కామారెడ్డిలోని సాందీపని డిగ్రీ కళాశాలలో మూడేళ్లుగా 220 మంది వరకు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించారు.
డిగ్రీ చేస్తుండగానే జాబ్
డిగ్రీ ఫైనలియర్ చేస్తుండగానే చాలా మంది యువత జాబ్‌లను కొట్టేస్తున్నారు. ఇన్ఫోసిస్, హిందూజా గ్రూప్, ఎలికో హెల్త్‌కేర్, జెన్‌ప్యాక్ట్, స్మార్ట్‌నెట్ ఐటీ సొల్యూషన్స్, ఐకేఎస్, హెల్త్‌కేర్, ఈ–ప్రాంటస్, టెక్ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీల డైరెక్టర్లు, ప్రతినిధులు నేరుగా కళాశాలలకు వచ్చి ఇంటర్వూ్యలను నిర్వహించారు. ఇప్పటివరకు డి గ్రీ ఫైనలియర్ చేస్తున్న 2 వేలకు పైగా డిగ్రీ విద్యార్థులకు సాందీపని కళాశాలలో ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిలో 220 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు.
భాషా నైపుణ్యం, స్కిల్స్, కం ప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వందల మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు హాజరవు తూ ఉద్యోగాలను సాధించుకుంటున్నారు. చిన్న వయస్సుల్లోనే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీల చుట్టూ తిరగకుండానే ఉద్యోగం
డిగ్రీ ఫైన్‌లియర్ చేస్తున్నాను. డిగ్రీ పూర్తికాగానే ఉద్యో గం వస్తుందో రా దోనని భయపడేదాన్ని. కానీ కళాశాల ప్రాంగణ నియామకాలతో చదువుతుండగానే ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
– దివ్య, బీఎస్సీ బీజెడ్సీ, లింగన్నపేట, సిరిసిల్ల జిల్లా
సద్వినియోగం చేసుకోవాలి
ప్రాంగణ నియామకాలతో డిగ్రీ ఫైనలియర్ చేస్తుండగానే ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఆ యా రాష్ట్రాల నుంచి ప్రముఖ కంపెనీ లు వచ్చి ఇంటర్వూ్యలు చేసి ఉద్యోగా లు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– బాలాజీరావు, సాందీపని కళాశాల డైరెక్టర్, కామారెడ్డి
చాలా సంతోషంగా ఉంది
నాకు టెక్ మహేంద్రలో సాఫ్ట్‌వేర్ టెక్సీషియన్‌గా ఉద్యోగం వచ్చింది. కంపెనీవారు కళాశాలకే వచ్చి ఇంటర్వూ్యలో ప్రతిభను గుర్తించి ఉద్యోగాలిస్తున్నారు. డిగ్రీలోనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు.
–పి.సింధు, ఎంఎస్‌టీసీఎస్, కామారెడ్డి
డిగ్రీలోనే ఉద్యోగం
సాందీపనిలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఫైనలియర్ ఉండగానే ప్రాంగణ నియామకాల్లో టెక్ మహేంద్రలో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. డిగ్రీలోనే ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
– జాకీర్, బీకాం సీఏ, రామాయంపేట
Comments
Please login to add a commentAdd a comment