కోజికోడ్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–కోజికోడ్ (ఐఐఎం–కే) విద్యార్థులను భారీ ఆఫర్స్ వరించాయి. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ విద్యార్థికి అత్యధికంగా ఏడాదికి రూ.52లక్షల వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు రాగా మొత్తం విద్యార్థుల సరాసరి వేతనం రూ.17.76 లక్షలుగా ఉందని ఐఐఎం(కే) ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది 382 మంది విద్యార్థుల బ్యాచ్‌లో అత్యధికంగా 367 మందిని డెలాయిట్, బీసీజీ, ఈవై, గోల్డ్‌మన్ సాక్స్, పీడబ్ల్యూసీ, ఆర్థర్ డీ లిటిల్, జేపీ మోర్గాన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు ఎంపిక చేసుకున్నాయని తెలిపింది. మిగతా వారిలో 11 మంది ప్లేస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనలేదనీ, నలుగురు మాత్రం ఎంపిక కాలేదని వెల్లడించింది. ఈ ఏడాది క్యాంపస్ ఎంపికలకు అత్యధికంగా 178 కంపెనీలు పాల్గొన్నాయనీ, ఇది గత ఏడాది కంటే 58శాతం ఎక్కువని ఐఐటీ–కే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment