ఇంజనీరింగ్.. కొలువు ఖాయం కావాలంటే!! | If you would employee engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్.. కొలువు ఖాయం కావాలంటే!!

Published Sun, Nov 30 2014 11:11 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

ఇంజనీరింగ్.. కొలువు ఖాయం కావాలంటే!! - Sakshi

ఇంజనీరింగ్.. కొలువు ఖాయం కావాలంటే!!

కార్పొరేట్ కంపెనీల్లో కొలువు ఖాయం.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లో నెగ్గితే ఉజ్వల కెరీర్‌కు తొలి అడుగు.. మంచి పర్సంటేజీ సొంతం చేసుకుంటే మెరుగైన ప్యాకేజీ  గ్యారెంటీ... ఏటా లక్షల మంది బీటెక్ వైపు అడుగులు వేయడానికి కారణాలివే..! కానీ నిరుత్సాహానికి గురవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. కంపెనీలు ఎంపిక చేసుకున్న ప్రముఖ కాలేజీల్లోనే క్యాంపస్ సెలక్షన్స్  నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం! 2014-15 బ్యాచ్ మరో ఆరు నెలల్లో కోర్సు పూర్తి చేసుకోనుంది. దాదాపు  అన్ని కళాశాలల్లో క్యాంపస్ సెలక్షన్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో  ఉద్యోగం దక్కని విద్యార్థులు.. సొంతంగా
 కొలువు సాధించేందుకు  అనుసరించాల్సిన మార్గాలపై ఫోకస్..  
 
వైపు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల్లో క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒక్కో విద్యార్థికి డబుల్, ట్రిపుల్ ఆఫర్స్. మరోవైపు ఒక్క కంపెనీ కూడా ప్లేస్‌మెంట్స్ కోసం అడుగుపెట్టని కళాశాలలు కోకొల్లలు. ఇది మన దేశంలో నేడు ఇంజనీరింగ్ విద్యలో ఎదురవు తున్న విచిత్రమైన పరిస్థితి. దాంతో ప్రతిభావంతులైన విద్యార్థులెందరో అవకాశాలకు దూరమవుతున్నారు. అలాంటి ప్రతిభావంతులు స్వయంకృషిని నమ్ముకుని ముందుకు సాగితే టాప్ కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
 
అకడమిక్‌తోపాటు అవసరమైన స్కిల్స్

స్వయం కృషితో కొలువు ఖాయం చేసుకోవాలనుకునే విద్యార్థులు అకడమిక్ పరిజ్ఞానంతోపాటు ముఖ్యంగా దృష్టిసారించాల్సిన అంశం.. స్కిల్స్. రెండు, మూడేళ్ల క్రితం వరకు స్కిల్స్ అంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు స్కిల్స్ అంటే.. సాఫ్ట్ స్కిల్స్ (కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్).. పీపుల్ స్కిల్స్ (ఇంటర్ పర్సనల్ స్కిల్స్, టీం వర్కింగ్ కల్చర్, టీం బిల్డింగ్ స్కిల్స్).. బిజినెస్ స్కిల్స్ (డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ అనలైజింగ్ స్కిల్స్). ఉద్యోగాన్వేషణ చేస్తున్న అభ్యర్థులు ఈ మూడు స్కిల్స్ సొంతం చేసుకోవడానికి కృషిచేయాలి. వీలుంటే శిక్షణ పొందాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ విషయంలో ఎంత ముందుంటే అవకాశాలు అంత మెరుగవుతాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శిక్షణ తీసుకోవడం కచ్చితంగా ఉపకరిస్తుంది. బిజినెస్ స్కిల్స్‌గా పేర్కొంటున్న డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్ అనలైజింగ్ స్కిల్స్ అనేవి విద్యార్థుల వ్యక్తిగత ఆలోచనకు సంబంధించినవి. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు ఈ స్కిల్స్ పెంచుకునే విషయం లో తమ మేధస్సుకు పదునుపెట్టాలి. ముందుగా ఏదో ఒక వాస్తవ సమస్యను చేపట్టి వాటికి తమ ఆలోచనకు అనుగుణంగా పరిష్కార మార్గాలను కనుగొనాలి. ఆ తర్వాత సదరు సమస్యకు సంబంధిత నిపుణులు కను గొన్న పరిష్కారాలతో బేరీజు వేసుకోవాలి. దీనివల్ల తాము ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలపై అవగాహన వస్తుంది. తద్వారా క్రమేణా విశ్లేషణ, సృజనాత్మక నైపు ణ్యాలు మెరుగవుతాయి. నియామక ప్రక్రియలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసి ద్ధత లభిస్తుంది.
 
‘వే’స్.. టు ఫైండ్ వేకెన్సీస్

ఉద్యోగ వేటలో తొలుత ఎక్కడ ఖాళీలు ఉన్నాయి.. ఏ కంపెనీలు నియామకాలు చేపడుతున్నాయి.. తమ అర్హ తలకు అనుగుణంగా పోస్టులు ఏవి? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఐదారేళ్ల క్రితం వరకు కంపెనీలు ఖాళీల భర్తీకి పత్రికా ప్రకటనలు విడుదల చేసేవి. ఇప్పుడంతా ఆన్‌లైన్ నోటిఫికేషన్స్ ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయం సాధించని విద్యార్థులు.. వేకెన్సీలను గుర్తించే దశ నుంచే వైవిధ్యాన్ని చాటాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
 
ముందున్న మార్గాలు

► {పస్తుతం అన్ని కంపెనీలు రిక్రూట్‌మెంట్ నోటిఫికే షన్స్‌కు ఆన్‌లైన్ ప్రసార మాధ్యమాలనే వినియోగి స్తున్నాయి. ఉద్యోగార్థుల కోణంలో జాబ్ సెర్చ్ ఇంజన్స్ ముఖ్యమైన మార్గాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి నౌకరీ డాట్ కామ్, మాన్‌స్టర్ ఇండియా డాట్ కామ్, టైమ్స్‌జాబ్స్ తదితర ఆన్‌లైన్ జాబ్ సెర్చ్ పోర్టల్స్‌ను నిరంతరం పరిశీలిస్తుండాలి. ఆయా జాబ్ పోర్టల్స్‌లో మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా తమ అర్హతలకు సరిపడే ఉద్యోగాల వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది.

►   ఆన్‌లైన్ జాబ్ సెర్చ్ పరంగా ఉపకరించే మరో ముఖ్యమైన మార్గం.. ట్విట్టర్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్, స్కిల్ పేజెస్ తదితర సోషల్ మీడియా వెబ్‌సైట్స్. లింక్డ్‌న్, స్కిల్ పేజెస్ డాట్ కామ్ వెబ్‌సైట్స్ ఆయా రంగాల్లో నిపుణులకు ఉద్దేశించినవిగా పేరు గడిస్తు న్నాయి. వీటిలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల తమ వివరాలు నేరుగా సదరు రంగంలోని ప్రొఫెషనల్స్ వీక్షించే అవకాశం ఉంటుంది. ఇవి కూడా అవకాశా లను మెరుగుపరుస్తాయి.

►  వీటితోపాటు ఉద్యోగార్థులు తమ అర్హతలను పరిగ ణనలోకి తీసుకుంటూ సంబంధిత కంపెనీల వెబ్‌సై ట్స్‌ను నిరంతరం వీక్షిస్తుండాలి. జాబ్ కన్సల్టెన్సీలను సంప్రదించడం కూడా మేలు చేస్తుంది. ఒక కన్సల్టె న్సీలో అడుగుపెట్టే ముందు సదరు కన్సల్టెన్సీకి ఉన్న గుర్తింపు విషయాన్ని తెలుసుకోవడం మంచిది.
 
ఇంటర్న్‌షిప్‌నకైనా.. ఓకే చెప్పాలి

ప్రస్తుతం ప్రముఖ కంపెనీలన్నీ రెగ్యులర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్స్‌తోపాటు ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఔత్సాహికులు కేవలం పూర్తిస్థాయి జాబ్స్‌కే పరిమితం కాకుండా.. ఇంటర్న్‌షిప్ అవకాశాలకు కూడా ఓకే చెప్పడం మేలు. ఇలా ఇంటర్న్‌షిప్‌లో ఎంపికై  కంపెనీలో చక్కటి పనితీరు కనబరిస్తే అక్కడే శాశ్వత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.
 
కోర్ బ్రాంచ్‌లు..  కలిసొచ్చే అదనపు సర్టిఫికేషన్స్
 
ఉద్యోగార్థుల విషయంలో అకడమిక్ డిగ్రీతోపాటు కలిసొ చ్చే ముఖ్య సాధనాలు.. సర్టిఫికేషన్స్. సదరు రంగంలో మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా కొత్త అంశాలపై శిక్షణనిచ్చే కోర్సులివి. సాధారణంగా ఇవి మూడు నుంచి ఆరునెలల వ్యవధిలో ఉంటాయి. వీటిలో నైపుణ్యం ద్వారా తాజా పరిస్థితులు, కంపెనీలు కార్యకలా పాల నిర్వహణలో అనుసరిస్తున్న కొత్త విధానాలు/పద్ధ తులపై అవగాహన ఏర్పడుతుంది.సాఫ్ట్‌వేర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ వరకు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ టెక్నాల జీ, సాఫ్ట్‌వేర్ మమేకం కావడంతో ఆయా రంగాలకు సం బంధించి సాఫ్ట్‌వేర్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.
 
బ్రాంచ్‌లవారీగా ఉపకరించే సర్టిఫికేషన్‌‌స..  ఈసీఈ
  
►  సిస్కో - సీసీఎన్‌ఏ సర్టిఫైడ్ నెట్‌వర్కింగ్ అసోసియేట్ (సీసీఎన్‌ఏ), సర్టిఫైడ్ నెట్‌వర్కింగ్ ప్రొఫెషనల్స్ (సీసీటీపీ) సర్టిఫికేషన్స్.
►   వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీ
►పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్)
 ► వీటితోపాటు క్యాడ్, క్యామ్, మైక్రోవేవ్ సర్టిఫికేషన్స్.
 
 ఈఈఈ
► సర్క్యూట్ అనాలిసిస్
►   పవర్ సిస్టమ్స్ అనాలిసిస్
►    లీనియర్ సిస్టమ్ అనాలిసిస్
►   {పోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్  (పీఎల్‌సీ) టెక్నీషియన్ సర్టిఫికెట్

►  ఎస్‌సీఏడీఏ
►  డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ సర్టిఫికెట్
 
 మెకానికల్

►   నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్(లెవల్ 1, 2, 3)
►   సిక్స్ సిగ్మా సర్టిఫికేషన్
►  ఎస్‌పీసీ సర్టిఫికేషన్
►    ఎస్‌క్యూసీ సర్టిఫికేషన్
 
 సీఎస్‌ఈ


►  శాప్(ఎస్‌ఏపీ)
►  రోబొటిక్స్   ఠి  టెస్టింగ్
►    ఒరాకిల్, ఎస్‌క్యూఎల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్
►   ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ    
►   ఎథికల్ హ్యాకింగ్
►   సీ, సీ++, జావా, హెచ్‌టీఎంఎల్, డాట్ నెట్ తదితర లాంగ్వేజెస్.
►    రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్
 
 సివిల్ ఇంజనీరింగ్
 
►    ఆటో క్యాడ్  ఠి  టెక్నికల్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్
►    బిల్డింగ్ డిజైనింగ్    ఠి  ఇంటీరియర్ డిజైనింగ్
 
 రెజ్యుమే.. మోస్ట్ ఇంపార్టెంట్

అకడమిక్ సర్టిఫికెట్స్, అదనపు సర్టిఫికేషన్స్, ఆపర్చుని టీస్.. ఇలా అన్నిటిలో అవగాహన పొందినప్పటికీ.. ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తుంది రెజ్యుమే. రెజ్యుమే అనేది రిక్రూటర్‌కు ఏ మాత్రం పరిచయం లేని ఒక అభ్యర్థికి సంబంధించి సమాచారం తెలుసుకునే సాధనం. ఇందులో పేర్కొన్న నైపుణ్యాలు, అర్హతలు, రెజ్యుమే రూపకల్పన తీరుతెన్నుల ఆధారంగానే అభ్యర్థి విషయంలో ఎంప్లాయర్‌కు ప్రాథమికంగా అవగాహన ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అభ్యర్థులు తమను తాము ప్రతిబింబించుకునే విధంగా రెజ్యుమేను రూపొందించాలి. ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలి. టైటిల్ నుంచి సిగ్నేచర్ కాలమ్ వరకు ప్రతి లైను, ప్రతి అక్షరం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ రెజ్యుమేను రూపొందించాలి.
 
 మంచి రెజ్యుమేకు మార్గాలు..

 
►  కెరీర్ ఆబ్జెక్టివ్

 రెజ్యుమేలో మొట్టమొదటి విభాగంగా పేర్కొనే కెరీర్ ఆబ్జె క్టివ్‌ను తెలపడంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అనవసరపు పదాడంబరాలు ఉపయోగించొద్దు. అదే విధంగా కెరీర్ ఆబ్జెక్టివ్ వ్యక్తిగత లక్ష్యాలను పేర్కొంటూనే, ఆ లక్ష్యసాధన క్రమంలో నిర్వర్తించే విధులు సంస్థకు కూడా ఉపకరిస్తాయనే అంశాన్ని స్పష్టంగా, సరళంగా పేర్కొనాలి.
 
► ‘కీ’ స్కిల్స్ పదాలు

 ప్రస్తుతం రెజ్యుమేలను స్వీకరించే ప్రక్రియ కూడా ఆన్‌లైన్ విధానంలో సాగుతోంది. దీంతో ఎంప్లాయర్స్ ముందుగానే తమకు అవసరమైన స్కిల్స్‌ను స్పష్టంగా పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ డేటాబేస్ ఆధారంగా సదరు రెజ్యుమేల్లో  స్కిల్స్‌కు సంబంధించి సమాచారం ఉందో లేదో కేవలం ఒక్క క్లిక్‌తో తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి రెజ్యుమేలో తప్పనిసరిగా నిర్దిష్ట స్కిల్స్‌కు సంబంధించి సమాచారం ఉండేలా చూసుకోవాలి.
 
► అకడమిక్ అర్హతలు

 రెజ్యుమేలో అకడమిక్ అర్హతలను పేర్కొనే విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోహణ క్రమంలో ఈ వివరాలు తెలపడం మంచిది. అంటే ముందుగా బీటెక్, తర్వాత ఇంటర్మీడియెట్, ఆ తర్వాత పదో తరగతి వివరాలు.
 
►  {పాజెక్ట్ వర్క్ వివరణ


 బీటెక్ విద్యార్థుల రెజ్యుమేలో ఎంతో ఉపయోగపడే అంశం తాము చేపట్టిన అకడమిక్ ప్రాజెక్ట్‌పై సంక్షిప్త వివరణ. సదరు ప్రాజెక్ట్ ఉద్దేశం, తాము చేపట్టిన ప్రాజెక్ట్ వర్క్ ద్వారా తెలుసుకున్న సమస్యలు, సూచించిన పరిష్కార మార్గాల గురించి కొద్దిపాటి వివరణ ఇవ్వాలి.  ఫలితంగా రిక్రూటర్‌కు సదరు అభ్యర్థి సొంతం చేసుకున్న క్షేత్ర స్థాయి నైపుణ్యంపైనా అవగాహన ఏర్పడుతుంది.
 
►  ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్

 ప్రస్తుతం కంపెనీలు కేవలం అకడమిక్ అర్హతలకే పరిమితం కాకుండా ఆయా అభ్యర్థులు పాల్పంచుకున్న ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌పైనా దృష్టిపెడుతు న్నాయి. హెచ్‌ఆర్‌రౌండ్ ఇంటర్వ్యూలో ఈ అంశం ప్రధానంగా నిలుస్తోంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ముందుంటే అభ్యర్థులు మానసికంగానూ దృఢంగా ఉంటారని, విధుల నిర్వహణలో టీం వర్కింగ్ కల్చర్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ పాటించడంలో ముందుంటారని కంపెనీల ప్రతినిధులు భావిస్తుండటమే ఇందుకు కారణం.   
 
 రిఫరెన్స్‌లు అవసరమా

 కంపెనీకి దరఖాస్తు చేసుకునే సమయంలో పంపించే రెజ్యుమే విషయంలో చాలామంది అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్న అంశం రిఫరెన్స్‌లు పేర్కొనాలా? వద్దా? అనేది. రిఫరెన్స్‌లు అంటే.. కంపెనీకి అవసరమైనప్పుడు సదరు అభ్యర్థి అకడమిక్ నైపుణ్యాలు, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్ గురించి చెప్పగలిగే వ్యక్తుల పేర్లు తెలపడం. ఈ వ్యక్తులు సదరు అభ్యర్థికి అకడమిక్ అంశాలు బోధించిన ప్రొఫెసర్లు లేదా సంబంధిత రంగంలో ప్రొఫెషనల్స్‌గా ఉండటం ఉపయుక్తం. వాస్తవానికి ప్రాథమిక దశలోనే రెజ్యుమేలో రిఫరెన్స్ పేర్లు తెలపాల్సిన అవసరం లేదనేది నిపుణుల అభిప్రాయం. నియామక ప్రక్రియలో తుది జాబితాలో నిలిచిన అభ్యర్థుల గురించి మాత్రమే కంపెనీలు తెలుసుకోవాలనుకుంటాయి. అలాంటి సందర్భాల్లోనే రిఫరెన్స్ పేర్ల ప్రస్తావన తెరపైకి వస్తుంది. కాబట్టి అభ్యర్థులు రిఫరెన్స్ నేమ్స్‌ను అందించడానికి సిద్ధం అనే దిశగా రెజ్యుమేలో ఆ అంశాన్ని పేర్కొనాలి. అతికొద్ది కంపెనీలు మాత్రమే దరఖాస్తు సమయంలోనే రిఫరెన్స్ పేర్లు లేదా రిఫరెన్స్ లెటర్స్ అడుగుతుంటాయి. అభ్యర్థులు తొలి దశలోనైనా, తుది దశలోనైనా రిఫరెన్స్ పేర్లు అందించేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ రిఫరెన్స్ పేర్లు పేర్కొనడంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. తమకు తోచిన ప్రొఫెసర్ల పేర్లు చెప్పకుండా  తమ గురించి పూర్తి స్థాయిలో తెలిసిన ప్రొఫెసర్లు లేదా ప్రొఫెషనల్స్ పేర్లు ఎంచుకోవడం మంచిది. రిఫరెన్స్ నేమ్స్‌గా పేర్కొంటున్న వారికి ముందుగానే ఆ విషయాన్ని చెప్పి అనుమతి తీసుకోవడం కూడా    ఎంతో ముఖ్యం.
 
 రెజ్యుమే ‘డూ’స్  అండ్ ‘డోన్ట్స్’

 
 ‘డూ’స్

►  తప్పనిసరిగా కెరీర్ ఆబ్జెక్టివ్‌ను పేర్కొనాలి
►  దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్, కంపెనీకి అనుగుణంగా కెరీర్ ఆబ్జెక్టివ్ ఉండేలా వ్యవహరించాలి.
►   అకడమిక్ అర్హతలతోపాటు అదనపు సర్టిఫికేషన్స్, టెక్నికల్ అర్హతలు ఉంటే తప్పనిసరిగా పేర్కొనాలి.
►   పంక్చుయేషన్స్, స్పెల్లింగ్స్ సరిగా ఉండాలి. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి.
►    వ్యక్తిగత వివరాలు సంక్షిప్తంగా తెలపాలి.
 
 ‘డోన్ట్స్:

►   రెజ్యుమే రూపకల్పనలో కాపీ-పేస్ట్ విధానాన్ని అనుసరించొద్దు.
►  రెజ్యుమేను రెండు లేదా మూడు పేజీలకు మించొద్దు.
►    అనవసర పదాలు వినియోగిం చొద్దు.
►  {పొనౌన్స్ వాడటం కూడా సరికాదు.
►   ముందస్తు అనుమతి లేకుండా రిఫరెన్స్ నేమ్స్ పేర్కొనద్దు.
 
 
 సాఫ్ట్ స్కిల్స్ కూడా ముఖ్యం


ఉద్యోగాన్వేషణలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్ నాలెడ్జ్‌తోపాటు సదరు బ్రాంచ్‌కు సంబంధించి ప్రస్తుత పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం సంబంధిత సెమినార్లకు హాజవరడం, తాజా జర్నల్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ఉద్యోగాన్వేషణ సాగిస్తే సర్టిఫికెట్ చేతికందేనాటికి సత్ఫలితాలు సొంతమవుతాయి.
 - బి. చెన్నకేశవరావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ
 
 అదనపు నైపుణ్యాలపై దృష్టి
 
పోటీ ప్రపంచంలో ప్రతి రంగంలో ప్రతి వారం లేదా నెలకు కొత్త ఆవిష్కరణలు తెరమీదికొస్తున్నాయి. వీటి గురించి విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా మారుతున్న అవసరా లకు అనుగుణంగా కంపెనీలు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్నాయి. అలాంటి వాటికి సంబంధించి అందుబాటులో ఉన్న సర్టిఫికేషన్ కోర్సులు చేయడం ద్వారా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ సర్టిఫికేషన్స్ కేవలం సాఫ్ట్‌వేర్, ఐటీ రంగానికే పరిమితం అని భావించొద్దు. కోర్ బ్రాంచ్‌లలో సైతం ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సదరు అభ్యర్థులు తమ రంగానికి అనుగుణమైన విభాగాల్లో అదనపు సర్టిఫికేషన్స్ చేయడం ద్వారా అదనపు నైపుణ్యాలు సొంతమై అవకాశాలు మెరుగవుతాయి.
 
 - ప్రొఫెసర్ డి.వి.ఎల్.ఎన్. సోమయాజులు,
 డీన్ (అకడమిక్స్)- నిట్ వరంగల్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement