18న ‘కిట్స్‌’లో క్యాంపస్‌ ఇంటర్వూలు | campus interviews in kits colleage | Sakshi
Sakshi News home page

18న ‘కిట్స్‌’లో క్యాంపస్‌ ఇంటర్వూలు

Published Tue, Aug 16 2016 9:03 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

campus interviews in kits colleage

ఎ.అగ్రహారం: మండలంలోని అంబికపల్లి అగ్రహారంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 18న కాకినాడ ‘వికాస’ ఆధ్వర్యాన ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.రామాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెన్‌పాక్ట్, హిందుజా, గ్లోబల్‌ సొల్యూషన్స్‌ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఈ ఇంటర్వూలకు 2014, 2015, 2016 సంవత్సరాల్లో బీటెక్, ఎంబీఏ, బీఫార్మశీ, డిప్లమో, డిగ్రీ పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు.
 
ఎంపికైనవారికి రూ. 1.5 లక్షల నుంచి, రూ.5 లక్షల వరకూ వార్షిక వేతనం ఉంటుందన్నారు. ఎంపికైనవారు వారంలోగా హైదరాబాద్‌లో ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధపడాలన్నారు. ఇంటర్వూ్యలకు హాజరయ్యేవారు 2 బయోడేటాలు, 2 పాస్‌పోర్టు ఫోటోలు, ఐడీ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. వివరాలకు 96765 53839, 77299 96999 సెల్‌ నంబర్లలో సంప్రదించాలని రామాంజనేయులు సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement