క్యాంపస్ సెలక్షన్స్లో ఓయూ విద్యార్థికి భారీ ఆఫర్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న సతీష్‌రెడ్డి ఏడాదికి రూ.20 లక్షల వేతనం గల ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్లేస్‌మెంట్ సెల్ డెరైక్టర్ ప్రొ.ఉమామహేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన డీఈ షో కంపెనీలో మన దేశంలోనే ఉద్యోగం చేసేందుకు ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సతీష్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలో నలుగురు విద్యార్థులు హాజరుకాగా సతీష్‌రెడ్డి ఒక్కరు మాత్రమే ఉద్యోగం పొందినట్లు డైరెక్టర్ ఉమామహేశ్వర్ చెప్పారు.