సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ సెల్‌లో కోర్ అండ్ డ్రీమ్ స్టేటస్ క్యాంపస్ నియామకాలు ఈ నెల 17, 18 తేదీల్లో జరిగాయి. అందులో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ అత్యధికంగా ఓ విద్యార్థికి ఏడాదికి రూ.36 లక్షల వేతనాన్ని, మరో విద్యార్థికి రూ.24 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసింది.
మ్యాథ్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో ముగ్గురు ఎంటెక్ విద్యార్థులకు రూ.17 లక్షల చొప్పున వేతనంతో నియమించుకుంది. రూ.14.5 లక్షల చొప్పున వేతనంతో ఏడుగురు బీటెక్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. మరో 10 మంది విద్యార్థులకు జోహో కంపెనీ రూ.6.6 లక్షల ప్యాకేజీ చొప్పున ఇచ్చింది. టెరడాట కంపె నీ రూ.8.28 లక్షల చొప్పున వేతనంతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment