
విలేకరులతో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి
చిత్తూరు (గిరింపేట): చిత్తూరు నగరం సరిహద్దులోని శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎస్వీసెట్)లో ఈనెల 6న ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌మేళా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. వివిధ రంగాలకు చెందిన మహేంద్ర ఫైనాన్స్, అమరాన్ బ్యాటరీస్, సాఫ్ట్‌బూట్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ, యాక్సెస్ బ్యాంకు, ఏడీఈసీసీవో, ఫ్లిప్‌కార్ట్, అపోలో, శ్రీవారి ఎంటర్‌ప్రైజెస్ మొబైల్ కంపెనీ, ఇతర కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటాయన్నారు. జిల్లాలోని పదో తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. జాబ్‌మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.9,500 నుంచి రూ.35 వేల వరకు జీతం వస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ్చpటటఛీఛి.జీn వెబ్‌సైట్‌లోకి వెళ్లి అ్కSSఈఇ అనే దానిపై క్లిక్‌చేసి పూర్తి వివరాలను ఈ నెల 5వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ అసోసియేట్ ప్రాజెక్టు మేనేజర్, చిత్తూరు అనే చిరునామాలో గాని, టోల్‌ఫ్రీ నంబర్లు 18004252422, 18004522429, ఫోన్ నెంబర్లు 9885114834, 7702020490లో సంప్రదించాలన్నారు.