క్యాంపస్ కొలువులు... పాతిక వేలు: టీసీఎస్ | TCS to give out campus offers to 25,000 people by February next year | Sakshi
Sakshi News home page

క్యాంపస్ కొలువులు... పాతిక వేలు: టీసీఎస్

Published Fri, Nov 22 2013 12:50 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

క్యాంపస్ కొలువులు... పాతిక వేలు: టీసీఎస్ - Sakshi

క్యాంపస్ కొలువులు... పాతిక వేలు: టీసీఎస్

బెంగళూరు: సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంస్థ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా 25 వేల ఉద్యోగాలివ్వనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా 25 వేలమందికి ఉద్యోగాలివ్వగలమని టీసీఎస్ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టామని కంపెనీ ఈవీపీ అండ్ గ్లోబల్ హెడ్ (హ్యూమన్ రిసోర్సెస్) అజోయ్ ముఖర్జీ చెప్పారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన అభ్యర్థులు జూలై నుంచి ఉద్యోగాలు చేస్తారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీన్ని సాధించగలమన్నారు. ఈ సంఖ్య పెంపు/తగ్గింపుపై త్వరలోనే సమీక్షిస్తామని తెలిపారు.
 
 ఆట్రీషన్ తక్కువ..: చాలా కంపెనీల్లాగా తాము ఉద్యోగాలివ్వడాన్ని వాయిదా వేయబోమని చెప్పారు. ఏ ఆర్థిక సంవత్సరంలో నియామకాలు నిర్వహిస్తామో, అదే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలిస్తామని అజోయ్ ముఖర్జీ వివరించారు. ట్రైనీలుగా చేరేవారికి ఏడాదికి రూ.3.15-3.25 లక్షల వేతనం ఇస్తామని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఫ్రెషర్స్‌కు ఇదే స్థాయిలో  వేతనాలిస్తున్నామని, దీన్ని మార్చితే మొత్తం వేతన విధానాన్ని సమూలంగా మార్చాల్సి వస్తుందని వివరించారు. ఆట్రీషన్(ఉద్యోగుల వలస) తమ కంపెనీలో తక్కువగా ఉందని, కంపెనీని వదిలిపోకుండా ఉన్న  ఉద్యోగుల సంఖ్య విషయంలో తామే అగ్రస్థానంలో ఉన్నామని వివరించారు. మార్కెట్ మొత్తం అస్తవ్యస్తంగా ఉండడం, డిమాండ్ కూడా తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement