హైదరాబాద్: ఒకే రోజు 4 టాప్ ఐటీ కంపెనీల్లో 6,064 మంది ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థులు ప్లేస్‌మెంట్లు సాధించి రికార్డు సృష్టించారని వర్సిటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ పారివేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విప్రో 1,641 మందికి, టీసీఎస్ 1,611 మందికి, కాగ్నిజెంట్ 1,506 మందికి, ఇన్ఫోసిస్ 1,306 మందికి ఆఫర్లు ఇచ్చాయని.. తద్వారా ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ తన నంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. తమ వర్సిటీపై, విద్యార్థులపై నమ్మకంతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయని.. ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన చేయడమే దీనికి కారణమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రబీర్ బాగ్చి పేర్కొన్నారు.