యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా వారికి మంచి అవకాశాలను అంది పుచ్చుకునే వీలు కల్పించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో కోట్లాది రూపాయలను మింగేయడం మాత్రం క్షంతవ్యం కాదు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ‘స్కిల్ డెవలప్మెంట్ సంస్థ’ ముసుగులో చేసిన నిర్వాకం నిధుల భక్షణే అనేది ఆయన అరెస్ట్‌తో తేలిపోయింది. అసలు స్కిల్ డెవెలప్మెంట్ అంటే ఏమిటి? వ్యక్తుల నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, వారికి తగిన ఉపాధి కలిగేలా చూడడం కదా. తిరుపతి సమీపంలో ఉన్న ‘శ్రీ సిటీ’లో జరుగుతున్నది ఇదే. అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను రాష్ట్ర అభివృద్ధికి ఎలా నైపుణ్యంగా ఉపయోగించుకోవాలో దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతలదే. కానీ ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి వెయ్యి కి.మీ. సముద్ర తీరం ఉంది. ఇక్కడ గోవాలో మాదిరిగా టెంట్స్ వేద్దామా, క్యాసినోలు పెడ దామా, పర్యాటకులకు వినోదం పంచుదామా అనే దగ్గరే ఆయన ఆలోచనలు ఆగిపోయాయి. అంటే సముద్ర తీరాన్ని ఒక జూద కేంద్రంగా, వ్యసనపరుల క్షేత్రంగా మార్చాలని చూశారు. అదృష్టవశాత్తు ఆయన కిందటి ఎన్నికల్లో ఓడి పోవడంతో ఆ ఆలోచనకు బ్రేక్ పడింది. అయితే అదే సముద్ర తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా, మెరైన్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ఇప్పటి ముఖ్య మంత్రి జగన్ చేశారు. ఒక ‘స్కిల్ యూనివర్స్’ పోర్టల్‌తను నెలకొల్పడానికి చేసిన కృషిఫలిస్తోంది.
ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐ శిక్షణ కేంద్రాలను ఉపయోగించుకుని యువతలో నైపు ణ్యాన్ని పెంపొందించడం, కొత్త స్కిల్ కాలేజీలూ, యూనివర్సిటీలను పెట్టడం ద్వారా యువత ఈ పోటీ ప్రçపంచంలో ముందుకు దూసుకు పోవ డానికి జగన్ చర్యలు చేపడుతున్నారు. 2019 వరకూ ఏపీలో అక్రిడిటేషన్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజి ఒకటే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 33 పాలిటెక్నిక్‌లు గుర్తింపు పొందాయి. ఐటీఐలను అభివృద్ధి చేశారు. ‘నాడు నేడు’ వంటి కార్యక్రమాలతో బడు లను బాగు చేశారు. ఆంగ్ల మాధ్యమాన్ని దిగువ తరగతికి చేరువ చేశారు. ప్రభుత్వ బడులలో కార్పొరేటుకు ధీటుగా విద్యాభ్యాసం జరిగేలా చూశారు. ఈ తరహా పాఠశాల విద్యతో విద్యా ర్థులకు సహజంగానే నైపుణ్య స్థాయి పెరుగుతుందనడంలో సందేహం లేదు.
పరిశ్రమలకు అను గుణంగా కోర్సులను ప్రవేశపెడుతూ, వాటితోటై అప్ పెట్టకొని యువతకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలను పొందేలా చేసే ‘భవిత’ కార్యక్రమం, సముద్ర తీరంలో ‘మెరైన్ రీసెర్చ్‌సెంటర్’ ఏర్పాటు, తిరుపతిలో ‘స్కిల్ యూని వర్సిటీ’ ఏర్పాటు చేయాలనుకోవడం వంటివి జగన్ విజన్‌కు కొన్ని నిదర్శనాలు మాత్రమే. విశాఖలో జగన్ ప్రసంగం రాష్ట్ర యువత నైపు ణ్యాలు ఎలా పెరగబోతున్నాయో ఆవిష్కరింప చేసింది. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ హబ్, జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజ్, ఇందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పు తామంటూ జగన్ చేసిన ప్రకటన యువత నైపుణ్యాల అభివృద్ధి పట్ల ఆయన ఎంత కృత నిశ్చయంతో ఉన్నదీ తేటతెల్లం చేసింది.
చదువు పూర్తవ్వగానే ఉపాధి కూడా కలిగేలా చేయాల న్నది ఆయన ఆశయం. అంతేగానీ చంద్రబాబు హయాంలో మాదిరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని బీరాలు పలకడం, ఆ తరవాత వదిలె య్యడం తన పద్ధతి కాదని జగన్ చెప్పకనే చెప్పారు.స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని బాబుకు అనుమానం రావచ్చు. ఆ అనుమానాలను పటాపంచలు చేయ గలిగేలా ఎంపీ లాడ్స్ నిధులలో కొంత శాతాన్ని ఇందుకోసం ఉపయోగించవచ్చని సీఎం జగన్ అంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, రాజ్య సభ సభ్యులకు ఏటా వచ్చే ఈ నిధులు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు అక్కరకు వస్తాయన డంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రజలను మోసగించాలనుకునే వారి ఆలో చనలు ఎప్పడూ తిన్నగా ఉండవు. సదుద్దేశంతో పాండవులు నిర్మించుకున్న మయసభలో దుర్యోధనుడు ఏ విధంగా భంగపడ్డాడో మనందరికీ తెలుసు. ఎంత నగుబాటు పాలయ్యాడో భారత కథ చెబుతుంది. అనంతర పరిణామాలు అతని నాశనానికి దారితీశాయి. ఇప్పుడు చంద్ర బాబు విషయంలో కూడా అదే జరగబోతుందనడంలో సందేహం లేదు. జగన్ నిర్మించిన స్కిల్ సౌధం చంద్రబాబుకు రాజకీయ సమాధిని కట్టడం ఖాయం.ఇదీ బాబు నైపుణ్యానికీ జగన్ సామర్థ్యానికీ మధ్య తేడా.
- వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు ,మొబైల్ : 98481 28844
- అడుసుమిల్లి జయప్రకాశ్
Comments
Please login to add a commentAdd a comment