నైపుణ్యాలు మెరుగయ్యేనా? | Special focus on skill development in the budget | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు మెరుగయ్యేనా?

Published Tue, Jul 30 2024 4:35 AM | Last Updated on Tue, Jul 30 2024 4:35 AM

Special focus on skill development in the budget

‘‘స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌’’

బడ్జెట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి 

స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ పేరుతో కొత్త పథకం 

ఇంటర్న్‌షిప్‌ పెంచే విధంగానూ చర్యలు 

ఇండస్ట్రీ, అకడమిక్‌ గ్యాప్‌ తగ్గించడమే ప్రధాన లక్ష్యం 

ఉద్యోగాల పెంపు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నిరాశ 

కేంద్ర బడ్జెట్‌లో.. యువతకు పెద్ద పీట వేశారా? మిలీనియల్స్‌(1981–1996 మధ్య పుట్టిన వారు)కు.. విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకున్నారా? ఇండస్ట్రీ, అకడమిక్‌ గ్యాప్‌ తగ్గించి తద్వారా ఇండస్ట్రీ రెడీగా యువతను తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారా? అంటే.. ఇండస్ట్రీ, అకడమిక్‌ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కారణం తాజా బడ్జెట్‌లో యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోణంలో పలు ప్రోత్సాహకాలు, ప్రతిపాదనలు ప్రకటించినా.. ఉద్యోగ కల్పన, జాబ్‌ మార్కెట్‌ డిమాండ్‌ పెంచే ప్రోత్సాహకాలు లేవని కొందరు అంటుంటే... ఐటీఐ నుంచి ప్రొఫెషనల్‌ డిగ్రీల వరకు అన్ని స్థాయిల్లో యువతకు నైపుణ్యాలు లభించేలా పలు పథకాలు ప్రకటించడం హర్షణీయ మని మరికొందరు పేర్కొంటున్నారు. 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోణంలో.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా.. రానున్న అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు  (ఐటీఐ)లను విస్తరించనున్నారు. ఈ క్రమంలో వేయి ఐటీఐలను అప్‌గ్రేడ్‌ చేసి ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్‌ను అందించేలా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా రానున్న అయిదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఆయా ట్రేడ్స్‌లో శిక్షణ ఇవ్వడమే కాకుండా.. వారు సంబంధిత విభాగంలో ఉద్యోగ సాధనలో ముందంజలో నిలిచేలా చర్యలు చేపట్టనున్నారు. 

ప్రస్తుతం ఎంఎస్‌డీఈ గణాంకాల ప్రకారం.. 135 ఐటీఐ ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్‌ అనుబంధ ట్రేడ్‌లు (ఎలక్ట్రిíÙయన్, ఫిట్టర్‌ తదితర) 60 ఉంటే.. మిగిలివని నాన్‌–టెక్నికల్‌ (ఫ్యాషన్‌ డిజైన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌తదితర) ట్రేడ్‌లు. తాజా స్కీమ్‌ ప్రకారం.. ప్రస్తుతమున్న ట్రేడ్‌లతోపాటు నూతన ట్రేడ్‌లను అదే విధంగా స్వల్పకాలిక శిక్షణను అందించే విధంగానూ చర్యలు తీసుకోనున్నారు.  

మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌
యువతకు ఉపాధి కల్పించే విషయంలో ఐటీఐలను విస్తరించడమే కాకుండా.. వృత్తి విద్య కోర్సులు చదివే వారికి రుణ సదుపాయం అందించే విధంగా.. మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌ను కూడా ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్‌ విధానాల ప్రకా­రం.. వృత్తి విద్య,  ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు రూ. 7.5 లక్షల వరకు రుణం అందిస్తారు. దీని ద్వారా ఏడాదికి 25 వేల మంది లబ్ధి పొందుతారని అంచనా వేశారు.  

వాస్తవానికి 2015లోనే స్కిల్‌ లోన్‌ స్కీమ్‌ పేరుతో ఒక పథకాన్ని రూపొందించారు. నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం వృత్తి విద్యకు సంబంధించి సరి్టఫికెట్, డిప్లొమా, డిగ్రీ చదువుతున్న వారికి వీటిని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం రూ. 1.5 లక్షలే ఉండగా.. తాజాగా ప్రతిపాదించిన మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌లో ఈ మొత్తాన్ని రూ. 7.5 లక్షలకు పెంచారు.  

ప్రాక్టికల్‌ నైపుణ్యాలు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోణంలో కొత్త పథకాన్ని రూపొందించడం, రుణ సదుపాయం, ఇంటర్న్‌íÙప్‌ సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడాన్ని.. విద్యార్థులకు, యువతకు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్న్‌షిప్‌ పథకం విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

గ్రామీణ స్థాయి నుంచే స్కిల్‌ డెవలప్‌మెంట్‌
స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌.. ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచే విద్యార్థులు, యువతకు స్కిల్‌ డెవ­లప్‌మెంట్‌ కల్పించడం. ఇందుకోసం హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో ఐటీఐలు శిక్షణ కార్యక్రమాలు అందించనున్నాయి. అంటే.. ఐటీఐలు లేని ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమకు సమీపంలోని ఐటీఐలలో తమకు నచ్చిన ట్రేడ్‌/వృత్తులలో శిక్షణ పొందొచ్చు. వాటిలో నైపుణ్యం పొంది భవిష్యత్తులో జాబ్‌ మార్కెట్‌లో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవడం, అదే విధంగా స్వయం ఉపాధి కోణంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం లభించనుంది.  

బడ్జెట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యాంశాలు  
» 20 లక్షల మంది  యువత లక్ష్యంగా స్కిల్‌ స్కీమ్‌ 
» అయిదేళ్లలో వేయి ఐటీఐల ఏర్పాటు 
» ఇంటర్న్‌షిప్‌ ఔత్సాహికులకు ఏడాదికి రూ. 60 వేల ప్రోత్సాహకం 
» అయిదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ ప్రోత్సాహకాలు 
» ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు  

‘స్కిల్స్‌ సరే.. ఉద్యోగాలు ఎక్కడ? 
ప్రభుత్వం ప్రకటించిన  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పథకాలు, ప్రోత్సాహకాలు పూర్తిగా సప్లయ్‌ (ఉద్యోగార్థులు) కోణంలోనే ఉన్నాయి. కానీ జాబ్‌ మార్కెట్‌ డిమాండ్‌ పెరిగేలా, సంస్థలు కొత్త ఉద్యోగాలు కల్పించేలా చర్యలు, ప్రోత్సాహకాలు అందించాలి. కొత్త ఉద్యోగాల కల్పన అనేది సంస్థలకు నూతన మార్కెట్‌ అవకాశాలు లభించినప్పుడు, దాని ద్వారా డిమాండ్‌ పెరిగనప్పుడే సాధ్యమవుతుంది. స్కిల్లింగ్, అప్రెంటీస్‌íÙప్స్, ఇంటర్న్‌షిప్స్‌ వంటి ప్రోత్సాహకాలతో ఉద్యోగార్థులు నైపుణ్యాలు పొందినా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందే అవకాశం లేదు. ఇది సాధ్యం కావాలంటే డిమాండ్‌ వైపు.. నూతన ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలి.   – టి. మురళీధరన్, చైర్మన్, టీఎంఐ గ్రూప్‌ 

ఐటీలోనూ నైపుణ్యాలకు మార్గం 
స్కీమ్‌ ఫర్‌ స్కిలింగ్‌ పేరుతో ప్రారంభించనున్న నూతన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ ఫలితంగా.. వృత్తి విద్య కోర్సులతోపాటు ఐటీ రంగానికి సంబంధించిన నైపుణ్యాలు కూడా పొందే ఆస్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఐటీ సహా.. 36 సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌.. శిక్షణనినస్తున్నాయి. ఐటీఐలలోనూ ఐటీ అనుబంధ ట్రేడ్‌లలో శిక్షణ లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే.. నూతన పథకం ఫలితంగా విద్యార్థులు.. ఇండస్ట్రీ రెడీ స్కిల్స్‌ సొంతం చేసుకుంటారనడంలో సందేహం లేదు.      – ఎం. సతీశ్‌ కుమార్, చీఫ్‌ సపోరి్టంగ్‌ ఆఫీసర్, నాస్‌కామ్‌ –ఎన్‌ఎస్‌డీసీ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ 

కాలేజ్‌లు చొరవ చూపాలి 
స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్, ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌లు సమర్థవంతంగా అమలయ్యేలా ఇన్‌స్టిట్యూట్స్‌ చొరవ చూపాలి. బీటెక్‌ స్థాయిలో మేము ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు తెలియక ఇబ్బంది పడుతున్నాం. దీనికి పరిష్కారంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ తరహాలో ఇంటర్న్‌షిప్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తే బాగుటుంది. అదే విధంగా కంపెనీల ప్రతినిధులు, కళాశాలల యాజమాన్యాలు ఉమ్మడి వేదికగా ఇంటర్న్‌ అవకాశాలు, ట్రైనీ వివరాలు పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  – టి. నిఖిల్‌ భరద్వాజ్, ఎంటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement