రాజు నెల వేతనం రూ.20 వేలు. ఇంటిఅద్దె రూ.తొమ్మిది వేలు చెల్లిస్తాడు. పిల్లల స్కూల్ ఫీజు ఏటా రూ.40 వేలు అంచనా వేసినా నెలకు రూ.3,500 అవుతుంది. కరెంటు బిల్లు, వైద్యం, రెస్టారెంట్, సినిమా, పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, సేవింగ్స్ కోసం రూ.నాలుగు వేలు ఖర్చు చేశాడని అనుకుందాం. ఈక్రమంలో నెలవారీ ఇంటి ఖర్చులు రూ.3,500 దాటాయంటే ఈఎంఐ తప్పదు. దీని ప్రభావం వచ్చేనెల ఖర్చులపై ఉంటుంది.
దేశంలోని చాలామంది తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఖర్చు చేస్తుంటారు. కొందరు అవసరాలకు మాత్రమే అప్పు చేస్తుంటే.. ఇంకొందరు వివిధ కారణాల వల్ల అప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో సరిపడా ఆదాయంలేని వారు ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఈఎంఐ తప్పడంలేదు. ఇండియాలో ఈఎంఐ కల్చర్ ఎలా ఉందనే అంశాలను తెలియజేస్తూ ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
దేశంలో దాదాపు 70 శాతం మంది ఐఫోన్ వినియోగదారులు ఈఎంఐ ద్వారానే వాటిని కొనుగోలు చేస్తున్నారని తేలింది. 80 శాతం కారు విక్రయదారులు ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. 60 శాతానికిపైగా ఇళ్లు హోంలోన్ ద్వారానే కొంటున్నారు. అయితే నెలవారీ సంపాదనలో మొత్తం ఈఎంఐలు 30 శాతం లోపే ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఈఎంఐ పెట్టాలనుకుంటే మాత్రం సంపాదన పెంచుకోవాలని చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, సంపాదన పెరిగితే ఈఎంఐ అవసరం లేకుండానే వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఐఫోన్ 13 రూ.11కే..?
దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొబైళ్లు, దుస్తులు, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు అత్యవసరం అయితే తప్పా కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సమాజం మన్ననలు పొందేందుకు ఆర్బాటాలకు పోయి అప్పు చేసి ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటే చివరకు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా, ప్రణాళికబద్దంగా అత్యవసరమైతేనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment