online purchases
-
పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!
రాజు నెల వేతనం రూ.20 వేలు. ఇంటిఅద్దె రూ.తొమ్మిది వేలు చెల్లిస్తాడు. పిల్లల స్కూల్ ఫీజు ఏటా రూ.40 వేలు అంచనా వేసినా నెలకు రూ.3,500 అవుతుంది. కరెంటు బిల్లు, వైద్యం, రెస్టారెంట్, సినిమా, పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, సేవింగ్స్ కోసం రూ.నాలుగు వేలు ఖర్చు చేశాడని అనుకుందాం. ఈక్రమంలో నెలవారీ ఇంటి ఖర్చులు రూ.3,500 దాటాయంటే ఈఎంఐ తప్పదు. దీని ప్రభావం వచ్చేనెల ఖర్చులపై ఉంటుంది.దేశంలోని చాలామంది తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఖర్చు చేస్తుంటారు. కొందరు అవసరాలకు మాత్రమే అప్పు చేస్తుంటే.. ఇంకొందరు వివిధ కారణాల వల్ల అప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో సరిపడా ఆదాయంలేని వారు ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఈఎంఐ తప్పడంలేదు. ఇండియాలో ఈఎంఐ కల్చర్ ఎలా ఉందనే అంశాలను తెలియజేస్తూ ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.దేశంలో దాదాపు 70 శాతం మంది ఐఫోన్ వినియోగదారులు ఈఎంఐ ద్వారానే వాటిని కొనుగోలు చేస్తున్నారని తేలింది. 80 శాతం కారు విక్రయదారులు ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. 60 శాతానికిపైగా ఇళ్లు హోంలోన్ ద్వారానే కొంటున్నారు. అయితే నెలవారీ సంపాదనలో మొత్తం ఈఎంఐలు 30 శాతం లోపే ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఈఎంఐ పెట్టాలనుకుంటే మాత్రం సంపాదన పెంచుకోవాలని చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, సంపాదన పెరిగితే ఈఎంఐ అవసరం లేకుండానే వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 13 రూ.11కే..?దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొబైళ్లు, దుస్తులు, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు అత్యవసరం అయితే తప్పా కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సమాజం మన్ననలు పొందేందుకు ఆర్బాటాలకు పోయి అప్పు చేసి ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటే చివరకు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా, ప్రణాళికబద్దంగా అత్యవసరమైతేనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. -
పిల్లలపై నజర్ పెట్టాలి.. లేకుంటే ఇలాంటివే జరుగుతాయి
ఆన్లైన్ క్లాసుల వంకతో స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతికే వెళ్లిపోతున్నాయి. అయితే తరగతులు అయిన తర్వాత కూడా చాలా సమయం ఫోన్లలలోనే గడిపేస్తున్నారు చాలామంది. ఆ టైంలో తల్లిదండ్రుల నిఘా ఉండకపోతే.. అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అలా పిల్లలపై నజర్ పెట్టక.. వీడియో గేమ్ వల్ల లక్ష రూపాయల దాకా పొగొట్టుకుంది ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ జంట. లక్నో: ఆ భార్యాభర్తలది ఉత్తర ప్రదేశ్ గోండా జిల్లాలోని ఓ గ్రామం. 12, 14 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు ఆ జంటకి. ఆన్లైన్ క్లాసులు నడుస్తుండడంతో పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చారు. భర్త బయట పనులకు వెళ్లగా.. భార్య ఇంటి పనుల్లో మునిగిపోయింది. అయితే క్లాసులు ముగిశాక కూడా. ఫోన్ వాళ్ల చేతుల్లోనే ఉండనిచ్చారు. ఇంకేం సరదాగా ఆన్లైన్ గేమ్ ఇన్స్టాల్ చేసుకుని.. అందులో మునిగిపోయారు ఆ అన్నదమ్ములు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. ఓసారి ఏడువేలు, మరోసారి 90 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతా ఖర్చుపెట్టి ఆటలో డైమండ్స్, క్యారెక్టర్ల కోసం బట్టలు కొన్నారు వాళ్లు. విషయం తెలియని ఆ పిల్లల తండ్రి.. వాళ్ల ఫీజుల కోసం డబ్బు డ్రా చేయడానికి బ్యాంక్‌కి వెళ్లాడు. అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆపై అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. అయితే గేమ్‌కు సంబంధించి లీగల్ ట్రాన్జాక్షన్ కావడంతో ఏం చేయలేమని పోలీసులు చెప్పారు. ఈ విషయం తెలిసిన గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా.. ఆ పేరెంట్స్‌కి కొంత ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చాడు. అంతేకాదు ఆయన స్థానికంగా ఉండే కొందరు పేరెంట్స్‌ను పిలిపించుకుని స్మార్ట్ ఫోన్లలో పిల్లల యాక్టివిటీపై నజర్ పెట్టాలని స్వయంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాడు. -
మొబైల్స్‌దే మెజారిటీ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఈ–కామర్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్లైన్ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే–జూలైతో పోలిస్తే ఆగస్టు–అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్లైన్ కస్టమర్ల షాపింగ్ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు–25 అక్టోబరు మధ్య ఫెస్టివ్ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్ వాటా ఏకంగా 53% ఉంది. అధిక ఆర్డర్లు ఎఫ్ఎంసీజీలో.. 2019 మే–ఆగస్టు కాలంలో జరిగిన షాపింగ్‌లో విలువ పరంగా మొబైల్స్ 48 శాతం, ఫ్యాషన్ 16 శాతం కైవసం చేసుకున్నాయి. ఇక అత్యధిక ఆర్డర్లు (పరిమాణం) ఎఫ్ఎంసీజీ విభాగంలో 56 శాతం చోటుచేసుకోవడం విశేషం. ఎఫ్ఎంసీజీలో ఎక్కువ ఆర్డర్లు 50 లక్షలు ఆపై జనాభా ఉన్న మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రథమ శ్రేణి నగరాల నుంచి మొబైల్ ఫోన్ల కోసం 50 శాతం ఆర్డర్లు వస్తే.. మెట్రోల నుంచి ఇది 38 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో మే–అక్టోబరు మధ్య నాలుగింట మూడు భాగాలు దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి. షాపింగ్ రాత్రిపూటే.. మొబైల్స్ తర్వాత ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్ సీజన్లో ప్రైమ్ టైంలో అంటే రాత్రి 8–11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్ నమోదైంది. పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్ పీరియడ్ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్ సీజన్ తొలి వారంలో 43 శాతం సేల్స్ జరిగాయి. -
ఆన్లైన్ కొనుగోళ్లలో ‘మొబైల్’ జోరు...
ముంబై: మొబైల్ ఫోన్ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్ రిపోర్ట్’ పేరిట పేపాల్, ఐపీఎస్‌ఓఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్‌ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇక వచ్చే 12 నెలల్లో మొబైల్ ఆప్టిమైజేషన్‌కు ప్రాధాన్యతను ఇవ్వనున్నామని 45 శాతం మంది వ్యాపారులు చెప్పినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లోని 22,000 మంది వినియోగదారులు(18–74 ఏళ్ల మధ్య వయస్సువారు), 4,000 మంది వ్యాపారులను సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. -
మన ఆన్లైన్ కొనుగోళ్లపై గూగుల్ కన్ను
శాన్ఫ్రాన్సిస్కో: ఆన్లైన్లో చేసే ప్రతి కొనుగోలును జీమెయిల్ అకౌంట్ ద్వారా గూగుల్ ట్రాక్ చేస్తోంది. ఓ ప్రైవేట్ వెబ్ టూల్ ద్వారా వినియోగదారులకు ఈ సమాచారం అందుబాటులో ఉంచుతామని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనల ట్రాకింగ్ కోసం వినియోగించట్లేదని తెలిపింది. వ్యక్తిగత ప్రకటనల కోసం జీమెయిల్ మెసేజ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించడం ఆపివేసినట్లు గూగుల్ 2017లో ప్రకటించింది. కొనుగోళ్లు, బుకింగ్‌లను సులభంగా చూడటానికి, ట్రాక్ చేయడానికి ప్రైవేట్ వెబ్ టూల్‌ను సృష్టించినట్లు పేర్కొంది. అందులోని సమాచారాన్ని ఎప్పుడైనా తొలగించే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. మొబైల్ యాప్‌లోని హోమ్ పేజీలో యాడ్ల ప్రదర్శనకు అనుమతిస్తున్నట్లు మే 14న కంపెనీ ప్రకటించింది. ఇకపై గూగుల్ షాపింగ్ హోమ్ పేజీలో కూడా యాడ్లు ప్రదర్శిస్తామని, వాటి ఆధారంగా వినియోగదారులు తాము ఇష్టపడే బ్రాండ్లు వెతికి పట్టుకోవచ్చని తెలిపింది. -
పశుబజార్ అమలెప్పుడో?
బేల(ఆదిలాబాద్): ఈ–మార్కెట్లో పండించిన పంటలు ఆన్లైన్ ద్వారా క్రయవిక్రయాలు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఏడాదిన్నర క్రితం ప్రతిష్ఠాత్మకంగా పశుబజార్ కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు అమలు అవుతుందో ప్రశార్థకంగా మారింది. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు తదితర వాటి విక్రయాలు, కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా పశుబజార్ ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ఏడాదిన్నరక్రితం ప్రారంభించారు. పశువులు అమ్మేందుకు, కొనేందుకు వేదికగా ఈ పశుబజార్ ఉపయోగపడుతుంది. ఈ పశుబజార్ వెబ్సైట్లో విక్రేతలు వారి పశువుల వివరాలు నమోదు చేసుకుంటే..అవసరమైన రైతులు తెలుసుకొని ఆయా ప్రాం తాలకు వెళ్లి స్వయంగా పరిశీలించి కొనుక్కోవాలనేది లక్ష్యం. తద్వారా శ్రమ, సమయం వృథా కావు. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో రైతులు, పశు పోషణదారుల వరకు చేరలేదు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు లేకపోలేదు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ఆశించిన ప్రచారం, రైతులతోపాటు పశు పోషణదారులతో ప్రత్యేక సమావేశాలు, సభలు ఇంతవరకు నిర్వహించలేదు. కేవలం పశువైద్యశాలలో వాల్ పోస్టర్ అతికించి వదిలేశారు. పశుబజార్ వెబ్‌సైట్‌పై అవగాహన, సాంకేతికంగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలు ఎంత మాత్రమూ వివరించలేదని తెలిసింది. దీంతో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర అమ్మకాలు పాత పద్ధతిలోనే కొనసాగతున్నాయి. దీంతో అందుబాటులోని సంతకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పశు బజార్‌తో కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభం.. ఈ పశుబజార్తో పశువుల కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభతరం కానుంది. పశువులు, ఇతరాత్ర వాటిని అమ్మదలచిన రైతులు వివరాలను పశు బజార్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాలు 30రోజుల వరకు వెబ్సైట్లో ఉంటాయి. పశువులను కొనదలిచిన వారు ఈ వెబ్సైట్ ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఇరువర్గాలు సంప్రదింపులు జరుపుకునే అవకాశం కూడా చేర్చారు. స్థానిక వాతావరణానికి తట్టుకునే పశువులు ఎంపిక చేసుకోవచ్చు. ఆశించిన పాడి పశువులు, దుక్కిటెద్దులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక గొర్రెలు, మేకలు, పందులు తదితరవి విక్రయించే వారికి కొనుగోలు చేసే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మాంసంకోసం వ్యాపారులు, వినియోగదారులకు కూడా ఈ పశుబజార్ మరింత ప్రయోజనకరంగా మారనుంది. ధరలు, నాణ్యత, అవసరమైన మేరకు సరుకు లభిస్తుంది. ఈ పశుబజార్ ఆన్లైన్ అనుసంధానంతోపాటు భౌతికంగా చూసి కొనుగోలు చేస్తే, మరింత మేలు జరగనుంది. దళారులకు చెక్.. సంతల్లో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర కొనుగోలు, అమ్మకాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య దళారులుగా వ్యవహరించే వారు ఇరువర్గాల నుంచి కమీషన్లను వసూలు చేస్తుంటారు. ఇంతేకాకుండా పలు సందర్భాల్లో విక్రయించే వారి నుంచి ధర కుదుర్చుకుని కొనుగోలుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అధిక రేట్లకు అమ్ముతున్న పరిస్థితి సంతల్లో జరుగుతోంది. పశు బజార్లపై అవగాహన కల్పిస్తే రైతులు, పశు పోషణదారులు నేరుగా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. తద్వారా ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. పశు బజార్ గురించి ఎవరు చెప్పలేదు సంతలు, అంగళ్లు తెలుసు. కానీ గవర్నమెంటు కొత్తగా పెట్టిన పశుబజార్ గురించి ఎవరూ చెప్పలేదు. తెలియదు. దుక్కిటెద్దులు, పాడి పశువులు అవసరం ఉంటే అందుబాటులోని సంతలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నాం. పశుబజార్పై అవగాహన లేదు. వివరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. – గౌరి పురుషోత్తం,రైతు బేల పశువులు అమ్మే, కొనేఆన్లైన్ మంచిదే పంటలను ఆన్లైన్ ఆమ్ముతున్నట్లు పశువులు అమ్మే, కొనే పశుబజార్ ఆన్లైన్ మంచిదే. దీనిపై గ్రామాల్లో ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా నిర్ణీత ధరలతోపాటు భౌతికంగా పశువు నచ్చితే అమ్మే, కొనే రైతులు నేరుగా క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. నష్టపోకుండా ఉంటాం.– గేడాం మనోహర్, పశు పోషణదారుడు సిర్సన్న అవగాహన కల్పిస్తాం రైతులు, పశు పోషణదారుల్లో ఈ పశుబజార్పై అవగాహన కల్పిస్తాం. ఏడాదిన్నర క్రితం ఇది ప్రారంభమైంది. పెద్దగా వినియోగంలో లేదు. అంతగా ప్రచారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ పశు బజార్‌తో ప్రత్యేకంగా పశువుల సంతకు వెళ్లే అవసరం లేదు. ధర, నాణ్యత పశుబజార్ ఆన్లైన్లో ఉండడంతో కూర్చున్న చోటనే మనకు నచ్చిన సరుకు మన దగ్గరకు తెప్పించుకోవచ్చు. సమయం, శ్రమ వృథాకావు. ఈ పశు బజార్‌పై సాంకేతికపరమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పశు బజార్‌ను వినియోగించుకుని, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. – సురేశ్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి -
బ్రిటన్‌లో 73 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లోనే
మీరు ఇంటర్నెట్ ఎంతవరకు ఉపయోగిస్తారు? గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఎంతమంది రోజూ ఉపయోగిస్తున్నారు.. అది కూడా ఆన్లైన్ షాపింగ్ కోసం ఏమాత్రం ఉపయోగపడుతోంది? మన దేశం మాటేమిటో గానీ, ఇంగ్లండ్‌లో మాత్రం ఏకంగా 73 శాతం మంది తమకు కావల్సిన వాటన్నింటినీ కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయం అక్కడి ప్రభుత్వం వెల్లడించిన వివరాల్లో తేలింది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఓఎన్ఎస్) లెక్కల ప్రకారం, బ్రిటన్‌లో ప్రస్తుతం 3.6 కోట్ల మంది పెద్దలు లేదా, మొత్తం జనాభాలో దాదాపు 73 శాతం మంది ప్రతిరోజూ ఇంటర్నెట్ ఉపయోగస్తున్నారు. 2006 సంవత్సరంలో కేవలం 2 కోట్ల మందే ఉపయోగించగా, ఇప్పుడీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నమాట. 2.1 కోట్ల కుటుంబాలు లేదా మొత్తం కుటుంబాల్లో 83 శాతం వాటికి ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ప్రజల రోజువారీ జీవన విధానాన్ని ఇంటర్నెట్ శరవేగంగా మార్చేసిందని ఓఎన్ఎస్ తెలిపింది. పెద్దల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్ వాడుతుండగా, ప్రతి పదిమందిలో ఆరుగురు మొబైల్‌ఫోన్ లేదా పోర్టబుల్ కంప్యూటర్లను ఇంటర్నెట్ కోసం ఉపయోగిస్తున్నారట. అయితే, బ్రిటన్‌లోని దాదాపు 40 లక్షల కుటుంబాలు లేదా.. మొత్తం కుటుంబాల్లో 17 శాతం మందికి ఇప్పటికీ అసలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. ఇక నెట్ వాడకంలో వివరాలు చూస్తే, దాదాపు సగం మందికి పైగా వార్తా పత్రికలు చదవడానికి లేదా డౌన్లోడ్ చేయడానికే ఉపయోగిస్తున్నారు. దీంతో వార్తా పత్రికలు కొని చదవడం బాగా తగ్గిపోయింది. సోషల్ నెట్వర్కింగ్ కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని ఓఎన్ఎస్ చెప్పింది. తమకు ఇంట్లో కావల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి 72 శాతం మంది ఆన్లైన్ స్టోర్స్ మీదే ఆధారపడుతున్నారు. 2008లో ఈ సంఖ్య 53 శాతం మాత్రమే. బ్రిటిష్ మహిళల్లో సగం మంది తమ దుస్తులను కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు.