
ముంబై: మొబైల్ ఫోన్ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్‌లైన్ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్ రిపోర్ట్’ పేరిట పేపాల్, ఐపీఎస్‌ఓఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్‌ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.
ఇక వచ్చే 12 నెలల్లో మొబైల్ ఆప్టిమైజేషన్‌కు ప్రాధాన్యతను ఇవ్వనున్నామని 45 శాతం మంది వ్యాపారులు చెప్పినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లోని 22,000 మంది వినియోగదారులు(18–74 ఏళ్ల మధ్య వయస్సువారు), 4,000 మంది వ్యాపారులను సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment