
ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సాక్షి, విశాఖపట్నం: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన నలుగురు నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి సోమవారం అనుమతించింది కోర్టు.
విచారణ కోసం 15 రోజుల కస్టడీ కోరింది ఈడీ. అయితే.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశించారు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని నిర్దేశించింది కోర్టు. దీంతో రేపటి నుంచే అరెస్ట్ అయిన నలుగురిని ఈడీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ‘స్కిల్’ గోల్‌మాల్ మీ ప్రభుత్వ హయాంలోదే.. వినబడుతోందా?