ED arrests four in Andhra Pradesh skill development scam - Sakshi
Sakshi News home page

AP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఈడీ దూకుడు.. నలుగురు అరెస్ట్‌

Published Fri, Mar 10 2023 5:09 PM | Last Updated on Fri, Mar 10 2023 6:06 PM

Ed Arrested Four In Ap Skill Development Scam Case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నలుగురిని ఈడీ అరెస్ట్‌ చేసింది. విశాఖ స్పెషల్‌ కోర్టులో వీరిని ఈడీ హజరుపర్చింది. నలుగురికి జ్యుడిషియల్‌ రిమాండ్‌ను కోర్టు విధించింది. సిమెన్స్‌ మాజీ ఎండీ శేఖర్‌ బోస్‌ సహా నలుగురు అరెస్టయ్యారు.

అరెస్టయిన వారిలో డిజీ టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌, పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్‌ ప్రాజెక్ట్‌ సీవోవో ముకుల్‌చంద్ర అగర్వాల్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌ సురేష్‌ గోయల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement