
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు రెండో రోజూ దర్యాప్తు కొనసాగించారు. హైదరాబాద్‌తో పాటు పూణే, ముంబై, ఢిల్లీలోని షెల్ కంపెనీల రికార్డులను పరిశీలించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఈ కేసులో అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ కె.లక్ష్మీనారాయణలతో పాటు 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని కీలక ఆధారాలను సేకరించడం కోసం సీఐడీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment