
దేశంతో, సమాజంతో ముడివడిన ప్రతి రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం, కొత్త నైపుణ్యాల అభివృద్ధి అత్యంత అవసరమైనవిగా మారాయి. విద్య లేదా ఆరోగ్యం, కార్మిక లేదా పరిశ్రమ రంగం; గ్రామం లేదా నగరం, ప్రభుత్వం లేదా కార్పొరేట్ వగైరాల్లో రంగం ఏదైనప్పటికీ కోవిడ్ అనంతర ప్రపంచంలో పరిజ్ఞాన, నైపుణ్యాలకు ప్రాముఖ్యం మరింత పెరిగింది. దీంతో వీటి అభివృద్ధికి భారతదేశం సరికొత్త దిశను నిర్దేశించింది.
ఆ మేరకు దేశంలోని యువతరం వివిధ నైపుణ్యాలతో తమ జీవితాలను దిద్దుకునే వీలు కల్పించడం ద్వారా వృద్ధికి, పురోగమనానికి బాటలు వేసింది. అంతేకాకుండా ఉపాధిని కాంక్షించే కోట్లాది యువత, వెనుకబడిన వర్గాల వారికి నైపుణ్యాలు, పునః నైపుణ్యం, ఉన్నత నైపుణ్యం ఒక తారకమంత్రంగా మారాయి. ‘స్కిల్ ఇండియా మిషన్’ యువతను అత్యుత్తమ మానవ వనరులుగా రూపుదిద్ది, నైపుణ్యాలకు కొత్త గుర్తింపును తెచ్చిపెడుతోంది.
ఆ విధంగా ఎంతో దూరదృష్టితో 7 సంవత్సరాల క్రిందట పునాది వేసిన స్వయం సమృద్ధ భారత సంకల్పాన్ని సాకారం చేయడం తేలిక అవుతోంది. 20 మంత్రిత్వ శాఖలు / విభాగాల్లో 40 కి పైగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఈ అమృతోత్సవాలలో భాగంగా అమలవుతున్నాయి. రానున్న 25 ఏళ్ల స్వతంత్ర భారత పురోగతి.. నైపుణ్యం గల యువతపైనే ఆధారపడి ఉందని దీని అర్థం.
(చదవండి: మహోజ్వల భారతి: వాటర్‌మ్యాన్)