సాక్షి, విజయవాడ: లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీ 111 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి ఆరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం,, రాజంపేట, తిరుపతి ఎంపి స్ధానాలకి అభ్యర్ధుల ఖరారయ్యారు.
తెలంగాణ నుంచి రెండు ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం తాండ్ర వినోద్ రావులకు టికెట్లు కేటాయించింది.
ఏపీ ఎంపీ స్ధానాలకు ఖరారైన పేర్లు
అనకాపల్లి- సీఎం రమేష్
అరకు- కొత్తపల్లి గీత
రాజమండ్రి- పురందేశ్వరి
నరసాపురం- శ్రీనివాస వర్మ
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
తిరుపతి- మాజీ ఐఎఎస్ మరియు గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్
అసలైన బీజేపీ నేతలకు దక్కని సీట్లు
ఇప్పటివరకూ పోటీలో ఉన్న అసలైన బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజులకు కూడా టికెట్లు దక్కలేదు. పొత్తు పేరుతో చంద్రబాబు కొత్త ఎత్తుగడలకు జీవీఎల్, పోము వీర్రాజులకు సీట్లు దక్కలేదు. బీజేపీలో కూడా తమ వాళ్లకే సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం రచించడంతో అసలైన బీజేపీ నేతలను పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీకి సేవ చేసిన నేతలు ఈ జాబితా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు సాన్నిహిత్యంగా ఉన్నవారికి బీజేపీ టికెట్లు కేటాయించడంపై అసలైన బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నర్సాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆశించిన రఘురామకృష్ణం రాజుకు చుక్కదురైంది. రఘురామ కృష్ణం రాజుకు చంద్రబాబు మొండిచేయి చూపించగా, అక్కడ ఎంపీ టికెట్‌ను శ్రీనివాస్ వర్మకు కేటాయించింది బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment