సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం కలిశారు. రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 13 వేల మంది నీట్ అభ్యర్థులున్నారు. పరీక్ష కోసం 200-300 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఏపీలో 11 నీట్ సెంటర్లున్నా.. ఉభయగోదావరి జిల్లాలో ఒక్కటి కూడా లేదు. నీట్ పరీక్ష కోసం విజయవాడ, విశాఖ వెళ్లాల్సి వస్తోందని’’ కేంద్రమంత్రికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment