ముగ్గురు ఎంపీలను బాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Tweet On Rajya Sabha MPs Resignation, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

ముగ్గురు రాజ్యసభ ఎంపీలను చంద్రబాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి

Published Tue, Sep 24 2024 8:38 PM | Last Updated on Wed, Sep 25 2024 10:46 AM

Vijayasaireddy Tweet On Ysrcp Rajyasabha Mps Resignation

సాక్షి,విజయవాడ:ముగ్గురు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీలను సంతలో పశువుల్లాగా కొనుగోలుచేసి వారితో రాజీనామా చేయించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈమేరకు విజయసాయిరెడ్డి మంగళవారం(సెప్టెంబర్‌24) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.

‘చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయి.వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు.మాటలతో గానీ,ప్రవర్తనతో గానీ మంచి వారిని బాధిస్తే నరకం వస్తుందని ధర్మశాస్త్రం చెబుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఇతనిని శిక్షించడా? హిందూ ధర్మశాస్త్రం/కర్మ సిద్ధాంతం చంద్రబాబుకు వర్తించదా? మరి ఇతడు పుట్టిన దగ్గరనుండి ఇతరులను వేధిస్తూనే పెరిగాడు.

75ఏళ్ళు వచ్చాయి. ఇంకా బాధిస్తూనే వున్నాడు.ఇతని పాపాలను చూసి దేవుడు కూడా దడుచుకున్నాడేమో అనిపిస్తున్నది.ఏది ఏమయినా బాధ పడుతున్నది ప్రజలు..ఎదుటివాళ్ళేగా.చంద్రబాబు బాగానే ఉన్నాడు.ఏ కోర్టులు ఇతడికి శిక్షలు వేయలేవు.చంద్రబాబు లాంటి వాళ్ళ గురించి జంధ్యాల పాపయ్యశాస్త్రీ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికే అత్తరు.మా మొగాన కన్నీరా మీ మొగాల పన్నీరా.కర్మల ప్రతికూల ఫలాలు ఈ జన్మలోనే తప్పక అనుభవిస్తావు చంద్రబాబు!’అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నాకు యూట్యూబ్‌ ఛానల్‌ లేదు: ఆర్కే రో జా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement