సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
కాగా, ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యసభలో ఈ రోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment