సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానానికి ఎంపీ మిథున్ రెడ్డి నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో... మధ్యాహ్నం 3:30 వరకు లోక్‌సభ వాయిదా వేశారు.
ఇక పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment