
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల విషయంలో నిరాశ కలిగించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మిథున్‌రెడ్డి స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగిందన్నారు. రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావవించలేదన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.
నిధులు కేటాయింపు ఏదీ: మోపిదేవి
ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, ‘‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీని అనేక సార్లు సీఎం కోరారు. చంద్రబాబు స్వార్థంతో పోలవరం తాకట్టు పెట్టారు. ఫిషరీస్ సెక్టార్‌ను సీఎం అభివృద్ధి చేస్తున్నారు. ఆక్వా విషయంలో కేంద్రం ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 6 లక్షల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తికి నిధులు కేటాయింపులు చేయాలి’’ అని మోపిదేవి కోరారు.
చదవండి: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి స్పందన
నిరాశ కలిగించింది: మార్గాని భరత్
‘‘ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. వీటి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి. పోలవరం నిధులు మెన్షన్ చేయలేదు. ఈ బడ్జెట్ నుంచి ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని’’ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment