కోవిడ్ మహమ్మారి ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పిచ్చింది. సుదీర్ఘమైన షిఫ్ట్‌లు, లే ఆఫ్‌లు, వేతనాల కోతలతో తమని కంపెనీలు వాడుకుంటున్నాయనే భావన నెలకొంది. అయితే ఇప్పుడు వైరస్ తగ‍్గుముఖం పట్టి వ్యాపారాలు పుంజుకోవడంతో కంపెనీలు ఆకర్షణీయమైన వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్న ఉద్యోగులు ఉండడం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గంలో పని వెతుక్కునే పనిలో పడ్డారు. భవిష్యత్తును భద్రం చేసుకునేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులు రిజైన్ చేశారు. చివరికి ఏమైందంటే.
అమెరికా బ్యూరో ఆఫ్ ల్యాబర్ స్టాటిస్టిక్స్ వివరాల ప్రకారం..గతేడాది నవంబర్‌లో 4.5మిలియన్ల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగులకు రాజీనామా చేశారు. డిసెంబర్ నెల నుంచి ఈ ఏడాది మొత్తం వరకు 23శాతం మంది కొత్త ఉద్యోగులకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నాన్ ప్రాఫిట్ ఆర‍్గనైజేషన్ 'హెల్త్ వైజ్'ను దిగ్రేట్ రిజిగ్నేషన్ వణికిచ్చింది. అందులో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. అప్పుడే జూలియట్ షోర్ చేసిన రీసెర్చ్ ఆధారంగా..కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు సంస్థను వదిలి పెట్టి వెళ్లి పోకుండా ఆపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టేలా చేసింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?
'జూలియట్ షోర్' ఎవరు?
బోస్టన్ కాలేజీలో జూలియట్ షోర్ ఎకనమిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే జూలియట్ షోర్ లేబర్ ఎకనమిస్ట్‌పై చేసిన రీసెర్చ్‌లో భాగంగా 1990ల నుంచి ఉద్యోగులు,వారి విధుల గురించి పలు ఆసక్తికర విషయాల్ని గుర్తించింది. ఈ రీసెర్చ్‌లో జూలియట్ షోర్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ది గ్రేట్ రిజిగ్నేషన్‌ను అరికట్టేందుకు ఉద్యోగులు కోరుకున్న జీతాలు, డిజిగ్నేషన్‌తో పాటు పని దినాల్ని కుదించాలని, వారంలో 4రోజుల పాటు విధులు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని గ్రహించింది. అందుకే తన నిర్ణయాన్ని హెల్త్ వైజ్ కంపెనీకి సూచించింది. అప్పటికే జూలియట్ షోర్ ప్రొఫెసర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, ఆథర్‌గా ఆమె రాసిన బుక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడంతో హెల్త్ వైజ్ ఆమె నిర్ణయాన్ని అంగీకరించింది.
ప్లాన్ వర్కౌట్ అయ్యింది!
గతేడాది ఆగస్ట్ నుంచి హెల్త్ వైజ్ సంస్థ జూలియట్ షోర్ చెప్పినట్లు వారానికి 4రోజుల పనిదినాలపై ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు పనితీరు బాగుంది. సంస్థకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.
ఉద్యోగులకు ఎలా ఉపయోగపడింది?
వారంలో 4రోజుల పనితో ఉద్యోగుల‍్లో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో ప్రొడక్టివిటీ పెరిగింది. ఎక్కువ గంటల పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. వారంలో మిగిలిన 3రోజుల పాటు ఉద్యోగులు వారి వ్యక్తి గత జీవితాల్ని కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నట్లు హెల్త్ వైజ్ సంస్థ గుర్తించింది. ఆ పని విధానాన్ని కంటిన్యూ చేయడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమైన వందల మంది ఉద్యోగులు తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు హెల్త్‌వైస్ సీఈఓ ఆడమ్ హుస్నీ వెల్లడించారు.
చదవండి👉ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు! భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ!
Comments
Please login to add a commentAdd a comment