నాలుగేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొంటా.. | mla s.rajender reddy comments on his political resign | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొంటా..

Published Tue, Feb 13 2018 1:20 PM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM

mla s.rajender reddy comments on his political resign - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

నారాయణపేట రూరల్‌: ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికే ఎమ్మెల్యేగా గెలిచానని.. మరో నాలుగేళ్లలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట మండలం శ్యాసన్‌పల్లిలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శేఖర్‌రెడ్డి ఉపన్యసిస్తూ నియోజకవర్గాల విభజన జరిగినా మరో ప్రాంతానికి పోకుండా చివరి వరకు నారాయణపేట ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందనగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్పందిస్తూ ఇప్ప టి వరకు బహిర్గతం చేయని ప లు అంశాలను చెబుతానంటూ మాట్లాడారు. 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మె ల్యే ఎల్కొటి ఎల్లారెడ్డి కోయిలకొండలో ప్రచారం కోసం తనని పిలిపించుకోగా 16 గ్రామాల్లో తాగు, సాగునీరు అజెండాతో ఓట్లు వేయించి 7,800 ఓట్ల మెజార్టీతో గెలిపించానన్నారు. ఆయన హామీ నెరవేర్చకపోవడంతో తన ప్రజల కోసం ఎమ్మెల్యేగా స్వయంగా పోటీచేసి అసెంబ్లీకి వెళ్లానని.. అధికార పార్టీలోకి మారి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే మిషన్‌ భగరథ కింద ఇంటింటికి తాగునీరు అందించే దిశగా పనులు వేగవంతం అయ్యాయని, ఇక మరో నాలుగేళ్లలో ప్రతీ ఎకరానికి సాగునీరు కూడా అందాక రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. 

రోడ్లు లేని నియోజకవర్గాల్లో రెండో స్థానం
తెలంగాణ ఏర్పాటు తర్వాత రోడ్లు లేని నియోజకవర్గాలపై సర్వే చేస్తే 37శాతంతో తెలంగాణలోనే రెండో స్థానంలో నారాయణపేట నియోజకవర్గం ఉందని తేలినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతోపట్టుబట్టి పీఆర్, ఆర్‌ఈండ్‌బీ, ట్రైబల్‌ వెల్పేర్‌ తదితర శాఱల ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకుని వచ్చి వంద శాతం రోడ్లు మంజూరు చేయించి మొదటి స్థానంలో నిలిపానన్నారు. ఇప్పటి వరకు మిషన్‌ భగీరథలో 406 వాటర్‌ట్యాంకులు, మిషన్‌ కాకతీయ కింద 331 చెరువుల మరమ్మత్తులు చేయించానన్నారు. ఎస్‌ఎల్‌డీసీ ప్రభుత్వ పరం కోసం 16 ఏళ్లుగా తిరిగినా కాకపోతే తాను పట్టుబట్టి చేయించానన్నారు. ఇక దశాబ్దాలుగా బ్ధాలుగా ఎదురుచూస్తున్న పట్టణ రోడ్డు వెడల్పు నష్టపరిహారం చెలిస్తూ పూర్తిచేస్తున్నామన్నారు. ముప్‌పై ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించానని.. త్రాసుతో కొలిచినా అభివృద్ధి సూచి తనవైపే నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.  

జాయమ్మ పేరుతో మోసం
జాయమ్మ చెరువు విషయమై ప్రతీ ఎన్నికల్లో హామి ఇచ్చిన నాయకులు ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవానికి చెరువును సైతం చూడని నాయకులు 0.6 టీఎంసీల సామర్ధ్యం ఉందని అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. రికార్డుల ప్రకారం కేవలం 0.01 టీఎంసీల సామర్థ్యంతో 90 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉన్న ఈ చెరువు డివిజన్‌ ప్రజల సాగు, తాగునీటిని తీరుస్తుందని కల్లబొల్లి మాటలతో మోసం చేశారని విమర్శించారు. సంగంబండ నుంచి పేరపళ్ల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.180కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయని, తక్కువ ఆయకట్టుకు అంత ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. పాలమూర్‌ – రంగారెడ్డి పథకంలో భాగంగా 103 కిలోమీటర్ల కాల్వ నారాయణపేట శివారులోని కొండారెడ్డిపల్లి చెరువుతో ముగుస్తుందని, మార్గమధ్యలో ఉన్న జాయమ్మకు నీరు మళ్లించేలా అనుమతి కోరుతామని తెలిపారు. ఈ విషయమై 17వ తేదీన రానున్న మంత్రి హరీష్‌రావుతో చర్చించి ప్రకటన చేయిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement