జోగిపేట, న్యూస్‌లైన్: రెండు, మూడు మాసాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంబ నకు తెరపడింది. కేసీఆర్‌కు సన్నిహితుడైన
బాబూమోహన్ బుధవారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్‌ఎస్ తరఫున అందోల్ సీటు ఆయనకేనంటూ ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కూడా అందోలు సీటు బాబూమోహన్‌కే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న విడుదల చేయనున్న తొలివిడత అభ్యర్థుల జాబితాలోనే బాబూమోహన్ పేరు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అందులో భాగంగానే జోగిపేటలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో కేసీఆర్ జోగిపేట అభ్యర్థిని ప్రకటించలేదని తెలుస్తోంది. తొలుత విజయోత్సవ సభలోనే గులాబీకండువా కప్పుకునేందుకు బాబూమోహన్ ఉత్సాహం చూపారనీ, అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందువల్లే బాబూమోహన్ బుధవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో పార్టీలో చేరారని సమాచారం.