
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు తాజా మాజీలకు మాత్రమే టికెట్లను నిరాకరించారు. చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్ కేటాయించారు. ఆందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీనటుడు బాబూమోహన్‌కు టికెట్ ఇవ్వకుండా, అక్కడ జర్నలిస్టు సీహెచ్ క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలను వెల్లడించలేదు. 2009 నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికలోనూ ఆయన గెలిచారు. అయితే స్థానికంగా ఉన్న వ్యతిరేకత వల్లనే టికెట్ నిరాకరించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment