తనదైన మ్యానరిజం కామెడీతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు కమెడియన్ బాబు మోహన్. అప్పట్లో సినిమా విజయాల్లో బాబు మోహన్ కామెడీ కీలక పాత్ర పోషించేంది. అప్పటి దర్శకులు సైతం బాబుమోహన్‌ని దృష్టిలో పెట్టుకొని కామెడీ సీన్స్ రాసేవారు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. హీరోగానూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక గత కొంత కాలంగా రాజకీయాలతో పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న బాబు మోహన్.. తాజాగా ఓ కామెడీ షోలో పాల్గొని అందరిని అలరించాడు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మృతి చెందిన విషయాన్ని చాలా కాలంపాటు జీర్ణించుకోలేకపోయానని, ఆ సమయంలో అస్తిపంజరంగా మారిపోయానని బాబుమోహన్ చెప్పుకొచ్చారు. ఒకనొక దశలో చనిపోవాలని అనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, బాబు మోహన్ ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బాబు మోహన్ సినిమాలకు దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment