
టీఆర్‌ఎస్‌లోకి బాబూమోహన్!
టీడీపీ నేత, మాజీమంత్రి బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు! ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత, మాజీమంత్రి బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు! ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈనెల 26 తర్వాత ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో బాబూమోహన్ ఆంధోల్ నుంచి పోటీచేసి 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు.