
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి బాబూమోహన్
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్రంలో అందరికి రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయనీయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికి బీమా పథకాన్ని అమలు పరుస్తామని మాజీ మంత్రి అందోలు బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ అన్నారు. మంగళవారం జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే కల్యాణలక్ష్మి పథకం ద్వారా చెల్లించే రూ.100.116 లక్షల రూపాయలతో పాటు మంగళ సూత్రానికి తులం బంగారం అందజేస్తామన్నారు.
డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివే విద్యార్థినులకు 50శాతం రాయితీపై స్కూటీలు, 7–10 తరగతులు చదివే విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అనంతరావు కులకర్ణి, జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి ఆర్.ప్రభాకర్‌గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రేమ్‌సాగర్, నియోజకవర్గ ఇంచార్జి ప్రభాత్‌కుమార్ నాయకులు వినయ్‌కుమార్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment