
అల్లాదుర్గంలో ప్రచారం చేస్తున్న బాబూమోహన్
సాక్షి, అల్లాదుర్గం(మెదక్): కేసీఆర్ కుటుంబ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని అందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ అన్నారు. సోమవారం అల్లాదుర్గం పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీలో నియంతృత్వం ఉందన్నారు. తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమా అని ఆయన ప్రశ్నించారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం టీఆర్‌ఎస్ పార్టీ నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకూ బీజేపీ బలపడుతోందన్నారు. ప్రధానమంత్రి మోది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు.
కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని బాబూమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్‌గౌడ్, అనంతరావుకులకర్ణి, రాములు, శామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆయన వెంట జనాలే లేరు. అల్లాదుర్గం మండలానికి చెందిన కార్యకర్తలు ఒకరిద్దరే ఆయన వెంట ఉండటం విశేషం. నియోజకవర్గం నుంచి బాబూమోహన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న జనాలు 20 మంది లోపే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment