నేరేళ్ల వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బాబూమోహన్
వరంగల్: విఖ్యాత మిమిక్రీ కళాకారుడు దివంత నేరేళ్ల వేణుమాధవ్ కుటుంబ సభ్యులను సినీ నటుడు, అంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తన మిమిక్రీ ప్రదర్శనలతో ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చిన మహావ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం మిమిక్రీ ప్రపంచానికి తీరని లోటు అన్నారు.ఆయన వెంట వరంగల్‌కు చెందిన సినీ నటుడు శ్యామల గణేష్, గుళ్లపెల్లి శ్రీనివాస్, బొమ్మల అంబేడ్కర్, డీడీ, ఏఐఆర్ ప్రొగ్రాం హెడ్ ఎంవీ.వాసుప్రసాద్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment