మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై నటుడు బాబు మోహన్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ప్రస్తుతం అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు మరణాన్ని గుర్తు చేసుకుని భావోద్యేగానికి లోనయ్యారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వార్త విన్న వెంటనే నాకు ఆనాటి సంఘటన గుర్తొచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ఈ సందర్భంగా ఆయన ఓ సందేశం ఇచ్చారు.
చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్
ఈ మేరకు.. ‘సాయి హెల్మెట్ పెట్టుకుని మంచి పని చేశాడు. ఎందుకో తెలియదు కొందరూ హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది మంచి పద్దతి కాదు. రోడ్డుపై నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదం బారిన పడితే దాని ప్రభావం వారి కుటుంబ సభ్యులు, నమ్ముకున్న వారిపై పడుతుంది. దానికి ఉదాహరణ నేనే. ఓ తండ్రిగా కొడుకును కోల్పోతే జీవితాంతం ఆ దు:ఖం ఉంటుంది, కడుపు తీపితో వచ్చే దు:ఖాన్ని ఎవరూ ఆపలేరు.
చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ వాడిన బైక్ ఏంటి? ధర ఎంత?
దయచేసి మోటారు బైకు ప్రియులు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుని బైక్ నడపాలని వేడుకుంటున్నా. మీ తల్లిదండ్రులను పూజించాల్సిన బాధ్యత మీపైనే ఉంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడొద్దని, వారిని ప్రేమించే వాళ్లు మానసిక క్షోభ అనుభవిస్తారన్నారు. ఈ విషయాన్ని యువత దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని బాబు మోహన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment