
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిల వసూలుకు అధికారులు నడుం బిగించారు. బకాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని తెగేసి చెప్తున్నారు. తాజాగా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఇంటి నల్లా కనెక్షన్‌ను వాటర్‌బోర్డు అధికారులు తొలగించారు. బాబుమోహన్ ఇంటిపై 4 లక్షల రూపాయల నల్లా బిల్లులు బకాయి ఉందని తెలిపారు. సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్ కూడా కట్ చేశారు. రవి ఇంటిపై రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment