HMWSSB
-
హైదరాబాద్ వాసులకు సువర్ణావకాశం..
సాక్షి, హైదరాబాద్: జలమండలి నీటి బకాయిల చెల్లింపునకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు మరో వారం రోజుల్లో ముగియనుంది. గడువు కాలంలో పెండింగ్ బిల్లులను చెల్లిస్తే ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందవచ్చు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారులకు జలమండలి సువర్ణావకాశం కల్పించింది. వినియోగదారులు సకాలంలో బకాయిలు చెల్లించే విధంగా విస్తృత ప్రచారం చేపట్టింది. బకాయిలున్న కనెక్షన్లు 7 లక్షలపైనే.. జలమండలి పరిధిలో సుమారు 13.50 లక్షలు నల్లా కనెక్షన్లు ఉండగా అందులో సుమారు 7.1 లక్షల కనెక్షన్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తమ్మీద దాదాపు రూ.1,706 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ఆలస్య రుసుముతో పాటు వడ్డీ రూపంలో ఉన్న రూ.1,189 కోట్ల బకాయిలు మాఫీ కానున్నాయి.చెల్లింపు విధానం ఇలా.. జలమండలి కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లల్లో చెల్లించవచ్చు. ఆన్లైన్ విధానంలో.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా NEFT, RTGS, BPPS ద్వారా.. జలమండలి అధికారిక వెబ్ సైట్ hyderabadwater.gov.in/enకు లాగిన్‌తో.. లైన్మెన్లు గృహాలను సందర్శించినప్పుడు వారి దగ్గర ఉండే EPOS యంత్రం ద్వారా కూడా చెల్లించవచ్చు. మీ సేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా సై తం బిల్లు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. జలమండలి అందించే QR Code స్కాన్ చేసి చెల్లించవచ్చు.వడ్డీ మాఫీ పరిధి ఇలా.. నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ బిల్లు మాఫీ చేసే అధికారం ఉంది. మొబైల్ నంబర్లకు సమాచారం జలమండలి పెండింగ్ బిల్లుల వినియోగదారుల క్యాన్ నంబర్‌కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు బకాయి మొత్తం, ఎంత చెల్లించాలి, ఎంత మాఫీ అవుతుంది తదితర వివరాలన్నీ సంక్షిప్త సమాచారం పంపిస్తోంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్ బుక్, ఎల్రక్టానిక్ మీడియా, ఎఫ్ఎం రేడియో, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఓటీఎస్–2024 పథకం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు ఇలా.. u ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. u గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. u గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది. u ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు. u తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్నారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!సద్వినియోగం చేసుకోవాలిపెండింగ్ బిల్లుల వినియోగదారులు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి.. ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలి. – అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్ బాబానగర్ వద్ద ఎయిర్ వాల్వ్‌లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది. (చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!) నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు డివిజన్ 1: ఎన్పీఏ పరిధిలోని ప్రాంతా లు. డివిజన్ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్. డివిజన్ 20: అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు: డివిజన్ 1: మీరాలం పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 3: భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 16: బుద్వేల్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20: శంషాబాద్ పరిధిలోని ప్రాంతాలు. -
ఉచిత తాగునీటి పథకానికి తాజా మార్గదర్శకాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం అమలుపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తాజాగా గురువారం మరిన్ని మార్గదర్శకాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మురికి వాడలు, అన్ని గృహవినియోగ నల్లాలకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు నీటిబిల్లులు మాఫీ చేయనున్నారు. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు, రెండో నల్లా కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా మాఫీ వర్తించనుంది. జనవరి 2022 నుంచి మురికి వాడలు మినహా ఇతర ప్రాంతాల వినియోగదారులకు నీటివినియోగం ఆధారంగా నీటిమీటరు రీడింగ్‌తో బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్సెస్ చెల్లించిన వినియోగదారులకు భవిష్యత్‌లో వారి కనెక్షన్‌కు జారీచేసే బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు 13 నెలల నీటిబిల్లు జారీ చేయనున్నారు. దీనిపై ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుం ఉండదు. (చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు) -
Hyderabad: ఉచిత నీటి పథకానికి సమీపిస్తున్న గడువు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందేందుకు వినియోగదారులు తమ కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జలమండలి ఈ నెల 31 చివరి గడువు విధించిన విషయం విదితమే. మహానగరంలో మొత్తం 9.84 లక్షల నల్లాలు ఉండగా ఈ నెల 17 వరకు సుమారు 50 శాతం మంది మా త్రమే నమోదు ప్రక్రి యను పూర్తిచేసుకున్నారు. వారం రోజులుగా అన్ని డివిజన్లలో కలిపి సుమారు 20 వేల మంది అనుసంధానం పూర్తి చేసుకున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నెల 31తో గడువు తీరనుండడంతో ఎంత మంది ముందుకొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉచితానికీ బద్ధకమేనా.. ► నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జలమండలి 13 నెలల సమయమిచ్చినా సిటీజన్లు ముందుకు రాకపోవడం గమనార్హం. నగరంలో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లున్న పలువురు వినియోగదారులు వాటిని అద్దెకిచ్చి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి అనుసంధానం చేసుకునే విషయంలో పలు ఇబ్బందులున్నాయి. ► వాణిజ్య నల్లాలు మినహా సుమారు 4.10 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలని జలమండలి సూచించింది. లేని పక్షంలో ఈ 13 నెలల నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ► ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి వేలల్లో నీటి బిల్లు చూసి వినియోగదారులు బెంబేలెత్తకుండా నాలుగు వాయిదాల్లో 13 నెలల బిల్లును చెల్లించే వెసులుబాటు ను కల్పించనున్నట్లు తెలిపింది. ► ఉచిత నీటిపథకానికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచే సదరు వినియోగదారులు నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని పొందుతారు. అప్పటివరకు నీటి బిల్లు చెల్లించాల్సిందే. (చదవండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్..) మీటర్లు తప్పనిసరి... ప్రతి గృహవినియోగ నల్లాకూ నీటి మీటరును సైతం వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే మీటర్లు ఉంటే అవి పని చేసే స్థితిలో ఉండాల్సిందే. ఈ మీటరు రీడింగ్ ఆధారంగా నెలకు 20 వేల లీటర్ల కంటే అధిక వినియోగం ఉన్న వినియోగదారుల నుంచి నీటిబిల్లు విధిగా వసూలు చేయనున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న అన్ని ఫ్లాట్ల యజమానులు అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా ఫ్లాట్ల వినియోగదారులకు నీటి బిల్లులు తథ్యం. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
పానీ చోర్.. పారాహుషార్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలపై జలమండలి విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధాన నగరంతో పాటు శివార్లలోనూ బోర్డు విజిలెన్స్ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమార్కులను జల్లెడ పడుతున్నారు. ఏళ్లుగా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో పలువురు నల్లాలను అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వైనంపై లోతుగా ఆరా తీస్తున్నారు. తీగ లాగితే డొంక కదులుతున్న చందంగా ఈ అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఇటీవల నగర శివార్లలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో.. అయిదు అక్రమ నల్లాల ఏర్పాటుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్షేత్రస్థాయి ఉద్యోగిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ►మహానగర పరిధిలో జలమండలికి 10.80 ల క్షల నల్లా కనెక్షన్లున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ(డొమెస్టిక్), మరో 2 లక్షల వరకు మురికి వాడలు (స్లమ్స్), మరో 80 వేల వరకు వాణిజ్య, బల్క్ నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాక సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలున్నట్లు అంచనా. ►పాత నగరం, ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనే తేడా లేకుండా ఈ అక్రమ నల్లాలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు జలమండలి అక్రమ నల్లాల భరతం పట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల తనిఖీలను ముమ్మరం చేయడంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. ►అక్రమ నల్లాలపై జలమండలి నజర్ ►శివార్లు, నగరంలో విస్తృత తనిఖీలు ►‘ఇంటి దొంగల’పైనా కేసులు నమోదు ►గ్రేటర్ పరిధిలో లక్ష వరకు అక్రమ నల్లాలు కంచే చేను మేసిన చందంగా.. ►జలమండలి పరిధిలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సహకారంతో పలువురు ఈ అక్రమ నల్లాలను ఏర్పాటు చేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. భూమి లోపలున్న జలమండలి మంచినీటి పైపులైన్లకు అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా కన్నాలు వేసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ►ఈ వ్యవహారంలో బోర్డు సిబ్బంది, ప్రైవేటు ప్లంబర్లు, జలమండలి నల్లా కనెక్షన్లు మంజూరు చేసే గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది పాత్ర సుస్పష్టం. ఏళ్లుగా బదిలీలు లేకుండా పనిచేస్తున్న సిబ్బంది కీలక పాత్రధారులుగా ఉంటున్నారు. విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడిన తర్వాత సదరు భవనాల యజమానులు, ఇందుకు సహకరించిన బోర్డు సిబ్బందిపైనా ఐపీసీ 269,430 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. సమాచారం అందించండి.. అక్రమ నల్లాలపై ఎలాంటి సమాచారాన్నైనా తమకు అందించాలని జలమండలి నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. గృహ వినియోగ నల్లా కనెక్షన్ తీసుకొని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిపైనా 99899 98100, 99899 92268 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. ఉచిత తాగునీటి పథకం పక్కదారి పట్టకుండా ఉండాలంటే అక్రమ నల్లాల అంతు చూడాలని జలమండలి భావిస్తోంది. ఈ దిశగా ముందుకు వెళుతోంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులను ముమ్మరం చేసింది. -
9 లక్షల కుటుంబాలకు ఉచిత తాగునీరు
రహమత్‌నగర్ (హైదరాబాద్): గ్రేటర్ పరిధిలో 9 లక్షల కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల మేర స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. పథకాన్ని అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ రహమత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ధానిక లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించారు. అనంతరం సమా వేశంలో మాట్లాడుతూ.. రాజధానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి కృష్ణా, గోదావరి జలాలను తరలించి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు శుద్ధిచేసి నగర ప్రజల తాగునీటి అవసరాలను ప్రభుత్వం తీరుస్తోందన్నారు. రాబో యే తరాలకు మంచినీటి సమస్య లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధంచేశారని తెలిపారు. ఎస్పీఆర్హిల్స్ రిజర్వాయర్‌కు రూ.8కోట్లు మంజూరు చేసి అద నపు నీటి నిల్వ సామర్థ్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లో ఖాళీ స్థలంలో రజకులు, నాయీ బ్రాహ్మణులకు కేటాయించి నివాసాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు జలమండలి రూపొందించిన బ్రోచర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనా«థ్, నాగేందర్, వివేక్, ముఠాగోపాల్, మున్సిపల్ పరిపాలన ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, ఎమ్మెల్సీ మల్లేశ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిలు పాల్గొన్నారు. -
జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జలమండలి శుక్రవారం వీడీఎస్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎలాంటి అదనపు చార్జీల్లేకుండానే కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. 2020 ఫిబ్రవరి 21 వరకు 90 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. నగరవాసులకు మంచి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని నగరానికి తీసుకొస్తోంది. ఇందుకు ప్రతి వెయ్యి లీటర్లకు గాను రూ.47 చొప్పున ఖర్చు చేస్తోంది. రోజుకు 472 మిలియన్ గ్యాలన్లు అంటే 214.76 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇందులో 37శాతం వివిధ కారణాలతో వృథా అవుతోంది. మరోవైపు కొంతమంది అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకొని జలమండలి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఫలితంగా జలమండలికి ప్రతినెల సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టిసారించిన జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం చుట్టింది. గతంలోనూ క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వగా.. మూడేళ్ల బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్ చార్జీలు పెనాల్టీగా వసూలు చేశారు. కానీ ఈసారి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చారు. ఈ పథకం కాలపరిమితి ముగిసిన తర్వాత క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే రెట్టింపు కనెక్షన్ చార్జీలు, మూడేళ్ల వినియోగ చార్జీలతో పాటు రూ.300 సర్వీస్ చార్జీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీడీఎస్లోనే క్రమబద్ధీకరించుకుంటే ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడంతో పాటు చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. వీడీఎస్‌కు సంబంధించి జలమండలి కార్యాలయ అధికారులను గానీ, 155313 నంబర్లో గానీ సంప్రదించొచ్చని సూచించారు. -
లక్షల్లో పేరుకు పోయిన ఎమ్మెల్యే ఇంటి నల్లా బిల్లు!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిల వసూలుకు అధికారులు నడుం బిగించారు. బకాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని తెగేసి చెప్తున్నారు. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఇంటి నల్లా కనెక్షన్‌ను వాటర్‌బోర్డు అధికారులు తొలగించారు. బాబుమోహన్ ఇంటిపై 4 లక్షల రూపాయల నల్లా బిల్లులు బకాయి ఉందని తెలిపారు. సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్ కూడా కట్ చేశారు. రవి ఇంటిపై రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని వెల్లడించారు. -
మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
-
ఉప్పల్ స్టేడియం వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్ హోల్ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మ్యాన్‌హోల్ నుంచి మృతదేహాలను బయటికి తీశారు. మృతులు సంతోష్(28), విజయ్(25)లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి స్వస్థలం ఒడిశా అని పోలీసులు తెలిపారు. జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం సెంట్రింగ్ కర్రలు తొలగించే క్రమంలో దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తప్పు ఎవరిది?: రెండేళ్ల కిందట హైటెక్ సిటీ సమీపంలో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్ద ఎత్తున మినీ ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన సందర్భంలో ‘‘ఇక నుంచి కార్మికులు మ్యాన్ హోల్స్‌లో దిగే పరిస్థితి ఉండదు’’ అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, బుధవారం ఉప్పల్ స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనలో తప్పు జలమండలిదా, ఎల్ అండ్ టీ సంస్థదా అన్నది తేలాల్సిఉంది. తోటి కార్మికుల మరణవార్త ఆ సంస్థలో పనిచేస్తోన్న మిగతావారిని కలవరపాటుకు గురిచేసంది. -
హడ్కో పురస్కారాన్ని అందుకున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి ప్రకటించిన హడ్కో అవార్డును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. మౌలిక వసతుల రంగంలో సాధించిన ప్రగతికిగానూ హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డుకు ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు అభించింది. హడ్కో 46వ వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి కేటీఆర్‌కు అవార్డును బహుకరించారు.