హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌ | HMWSSB: Pipeline Repair Affect Water Supply Issue These Areas | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌.. 18 గంటలు కీలకం

Published Thu, Nov 24 2022 1:29 PM | Last Updated on Thu, Nov 24 2022 3:02 PM

HMWSSB: Pipeline Repair Affect Water Supply Issue These Areas - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్‌– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్‌ పైప్‌లైన్‌కు బాలాపూర్‌ శివాజీ చౌక్‌ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్‌ బాబానగర్‌ వద్ద ఎయిర్‌ వాల్వ్‌లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6  నుంచి  ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది.
(చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్‌ఎంసీకి వెళ్లాల్సిందేనట..!)

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు
డివిజన్‌ 1: ఎన్‌పీఏ పరిధిలోని ప్రాంతా లు.
డివిజన్‌ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్‌.
డివిజన్‌ 20: అల్మాస్‌గూడ, లెనిన్‌ నగర్, బడంగ్‌పేట్, ఏఆర్సీఐ.

తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు:
డివిజన్‌ 1:  మీరాలం పరిధిలోని ప్రాంతాలు.
డివిజన్‌ 3:  భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు.
డివిజన్‌ 16:  బుద్వేల్‌ పరిధిలోని ప్రాంతాలు.  డివిజన్‌ 20:  శంషాబాద్‌ పరిధిలోని ప్రాంతాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement