కమెడియన్, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబూ మోహన్. ఆహుతి సినిమాతో ఆయన సినీప్రస్థానం మొదలైంది. తొలి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన బాబూ మోహన్ తక్కువ కాలంలో కమెడియన్‌గా టాప్ పొజిషన్‌కు వెళ్లాడు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించేసిన ఈయన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆర్గానిక మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఓ బుల్లితెర షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన పిల్లలు వేసిన ఎమోషనల్ స్కిట్ చూసి ఏడ్చేశాడు.
తన చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఒక్కసారిగా నన్ను గతంలోకి తీసుకెళ్లారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను మూడో తరగతి చదువుతుండగా అమ్మ చనిపోయింది. నాకో చిన్న చెల్లెలు. చిన్నప్పటి నుంచి తల దువ్వి జడ వేసి దగ్గరుండి చూసుకున్నాను. మా నాన్న ఎక్కడికో వెళ్లిపోయారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు' అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
బాబూ మోహన్ ఎక్కువగా కోట శ్రీనివాస్ రావుతో కలిసి కామెడీ పండించేవారు. ఆ తర్వాత బ్రహ్మానందంతో ఎక్కుగా కాంబినేషన్ కామెడీ సీన్లు ఉండేవి. మామగారు సినిమాకుగానూ బాబూ మోహన్ నంది అవార్డు అందుకున్నాడు. తెలుగు వెండితెరపై టాప్ కమెడియన్‌గా రాణించిన ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు.
చదవండి: వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటూ అభిమానుల హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment