పరిశోధన ప్రాజెక్టు చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర మద్దు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంలో జాప్యమెందుకని హైకోర్టు ఎస్కేయూ స్టాండింగ్ కౌన్సిల్‌ను ప్రశ్నించింది.
అనుమతికి జాప్యమెందుకు ?
Published Wed, Jul 20 2016 12:25 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
ఎస్కేయూ స్టాండింగ్ కౌన్సిల్‌కు హైకోర్టు అక్షింతలు
ఎస్కేయూ : పరిశోధన ప్రాజెక్టు చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర మద్దు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంలో జాప్యమెందుకని హైకోర్టు ఎస్కేయూ స్టాండింగ్ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. వెంటనే ఆయన్ను రిలీవ్ చేయాలని సోమవారం తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్కేయూలోని బయో కెమిస్ట్రీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర మద్దు రామన్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఇందుకోసం అమెరికాలో ఏడాది పాటు పరిశోధన చేయాల్సి ఉంది. అనుమతి కోసం ఫిబ్రవరిలో ఎస్కేయూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు స్పందించలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని నరేంద్రమద్దు జూన్ 11వ తేదీ హై కోర్టును ఆశ్రయించాడు. జూన్ 30 లోగా అమెరికాలోని రామన్ రీసెర్చ్ బోర్డుకు రిపోర్ట్ చేయాల్సి ఉందని తమకు వర్సిటీ నుంచి అనుమతి మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తన వాదనలు వినిపించాడు. వాదోపవాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు వెంటనే రిలీవ్ చేయాలని సోమవారం తన తీర్పునిచ్చారు. ఇదిలా ఉండగా తీర్పుపై స్టే ఇవ్వాలని ఎస్కేయూ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టులో మరో కేసు దాఖలు చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement