మంచేదో.. చెడేదో? చెప్పేవారు కరువయ్యారు.. | Robot Counselling To The People In London | Sakshi
Sakshi News home page

కౌన్సెలర్లుగా రోబోలు! 

Published Sun, May 6 2018 10:02 PM | Last Updated on Sun, May 6 2018 10:02 PM

Robot Counselling To The People In London - Sakshi

లండన్‌ : పెరుగుతున్న పాశ్చాత్య పోకడలు ఉమ్మడి కుటుంబాలను కనుమరుగు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో పెద్దవారు లేకుండా పోతున్నారు. మంచేదో? చెడేదో? కూడా చెప్పేవారు కరువయ్యారు. దీంతో సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా సైకియాట్రిస్టుల దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ అవసరాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు కౌన్సెలింగ్‌ ఇచ్చే ఓ రోబోను తయారుచేశారు. ఈ రోబో.. అచ్చంగా ఓ అనుభవమున్న కౌన్సెలర్‌గా వ్యవహరిస్తుందని, తన వద్దకు వచ్చే క్లయింట్ల సమస్యను చక్కగా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. 

ప్రయోగాత్మకంగా పరీక్షించగా... సంతృప్తికరమైన ఫలితాలు కూడా వచ్చాయని చెబుతున్నారు యూకేలోని ప్లైమౌత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మార్పు కోరుకుంటూ తన వద్దకు వచ్చేవారికి ఈ రోబో మోటివేషనల్‌ ఇంటర్వ్యూ చేస్తుందని, దీనివల్ల క్లయింట్లలో మార్పును స్పష్టంగా గమనించామంటున్నారు. అంతేకాకుండా ఈ రోబోతో కౌన్సెలింగ్‌ పూర్తిచేసుకున్నవారి ఫిజికల్‌ యాక్టివిటీ, లక్ష్యాన్ని సాధించాలన్న తపన, నిర్ణయాలలో స్పష్టత వంటివి పెరిగినట్లు గుర్తించామని చెప్పారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement