తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్
పెనుగొండ: ములపర్రు శివారు పితానివారిపాలెంలో శుక్రవారం జరగా ల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు నిలుపుదల చేసారు. గుర్తుతెలియని వ్యక్తులు 1100 సమాచారం అందించడంతో ములపర్రులో గురువారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్.వెంకటేశ్వరి విచారణ చేపట్టారు. పితానివారిపాలెంకు చెందిన శీలం వరలక్ష్మి అనే బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఆమెకు వివాహ వయసు రాలేదని గుర్తించిన అధికారులు బాలిక తల్లిదండ్రులు నాగేశ్వరరావు, దుర్గకు అవగాహన కల్పించారు. బాల్య వివాహం చేయడం వలన కలిగే అనర్థాలు, చట్ట నిబంధనలు వివరించారు. వివాహం జరిపిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. సొంగా రాజు, అంగన్‌వాడీ వర్కర్ కె.దుర్గ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment