విజయనగరం :జిల్లాలోని ఓ బాల్య వివాహాన్ని అధికారులు గురువారం అడ్డుకున్నారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గొలుగువలస గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు శుక్రవారం వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు విషయాన్ని ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు.
వెంటనే బాలిక తల్లిదండ్రులను కలిసిన ఐసీడీఎస్ అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో వివాహాన్ని ఆపేందుకు వారు సమ్మతించారు.