ఏపీ లాసెట్-2015 కౌన్సెలింగ్ మరింత జాప్యం కానుందని కన్వీనర్ ఆచార్య ఎస్.శేషయ్య మంగళవారం తెలిపారు.
అనంతపురం : ఏపీ లాసెట్-2015 కౌన్సెలింగ్ మరింత జాప్యం కానుందని కన్వీనర్ ఆచార్య ఎస్.శేషయ్య మంగళవారం తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ కళాశాలల్లో సీట్ల సంఖ్య, అనుమతిని ఉన్నత విద్యాశాఖకు తెలుపలేదని పేర్కొన్నారు. ఆ సంస్థ నుంచి సమాచారం అందిన తరువాతే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.
ఏపీ లాసెట్ కన్వీనర్‌ను సంప్రదించకుండానే కొన్ని వెబ్‌సైట్లు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించాయని, దీనివల్ల విద్యార్థుల్లో అయోమయం నెలకొందని తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలను అధికారిక వెబ్సైట్ www.aplawcet.org ద్వారా తెలుపుతామని వెల్లడించారు.