తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా | telangana eamcet medical counselling postponed | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా

Published Sun, Jul 24 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా

తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. పేపర్ లీకేజీ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జరగాల్సిన మెడికల్ కౌన్సెలింగ్ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్-2 పేపర్ లీకేజీపై సీఐడీ విచారణ పూర్తయిన అనంతరం కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్-2లో కొందరు సాధారణ విద్యార్థులు అనూహ్యమైన ర్యాంకులు సాధించిన నేపథ్యంలో పేపర్ లీకేజీపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

కాగా, ఎంసెట్ పేపర్ లీకేజీ వార్తలపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. విద్యావ్యవస్థను బలహీనపరిచేలా, పరీక్షలను అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించే వ్యక్తులు, శక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో పేపర్ లీకేజీలకు, ఫేక్ సర్టిఫికేట్లకు స్థానం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement