
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య, దంత డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న ఉదయం 8.30 గంటల నుంచి ఉస్మానియా క్యాంపస్‌లోని ప్రొ.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకుని, యూనివర్సిటీ విడుదల చేసిన మెరిట్ జాబితాలోని అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. అభ్యర్థులందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. మేనేజ్‌మెంట్ కోటా మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది కాలేజీల్లో చేరని అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు. మరింత సమాచారాన్ని యూనివర్సిటీ వెబ్‌సైట్ knruhs.in లో చూడవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment